అజ్ఞాతం వీడిన గాలి: పోలీసుల ముందు హాజరు

By pratap reddyFirst Published Nov 10, 2018, 4:13 PM IST
Highlights

అంబిడెంట్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వాహకులకు కేసుల నుంచి విముక్తి కలిగించడానికి హామీ ఇచ్చిన రూ.20కోట్ల డీల్‌ లో ఆయన ఇరుక్కున్న విషయం తెలిసిందే.  ఈ నెల 7వ తేదీ నుంచి ఆయన పరారీలో ఉన్నారు. 

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఆయన న్యాయవాదితో కలిసి వచ్చి ఆయన శనివారం బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు లొంగిపోయారు. తనకు నిన్ననే నోటీసులు అందాయని, అందుకే ఈ రోజు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరయ్యానని ఆయన చెప్పారు. 

తనకు వ్యతిరేకంగా ఏ విధమైన సాక్ష్యాలు లేవని, పోలీసుల విచారణకు సహకరిస్తానని ఆయన చెప్పారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, బెంగళూరులోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. 

తాను ఏ విధమైన తప్పూ చేయలేదని చెప్పారు. కొంత మంది కావాలని తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. మూడు రోజులుగా తాను బెంగళూరులోని తన నివాసంలోనే ఉన్నానని చెప్పారు. 

అంబిడెంట్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వాహకులకు కేసుల నుంచి విముక్తి కలిగించడానికి హామీ ఇచ్చిన రూ.20కోట్ల డీల్‌ లో ఆయన ఇరుక్కున్న విషయం తెలిసిందే.  ఈ నెల 7వ తేదీ నుంచి ఆయన పరారీలో ఉన్నారు. 

 

Bengaluru: G Janardhan Reddy reaches Crime Branch office in connection with Ambident Group alleged bribery case. pic.twitter.com/ihP477ue4F

— ANI (@ANI)

సంబధిత వార్తలు

పోలీసులకు లొంగిపోనున్న గాలి..?

పరారీలో గాలి జనార్దన్ రెడ్డి: బయటపడిన షాకింగ్ విషయాలు

పోలీసు వేట: గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాదులో ఉన్నారా...

అంబిడెంట్ కంపెనీతో డీల్: పరారీలో గాలి జనార్ధన్ రెడ్డి

పరారీలో గాలి జనార్థన్ రెడ్డి...ఎమ్మెల్యే శ్రీరాములు ఏమన్నారంటే

 

click me!