‘‘మీ అమ్మాయి విసిగించింది చంపేశా’’.. అత్తకి ఫోన్ చేసి, అల్లుడు జంప్

sivanagaprasad kodati |  
Published : Nov 10, 2018, 02:14 PM IST
‘‘మీ అమ్మాయి విసిగించింది చంపేశా’’.. అత్తకి ఫోన్ చేసి, అల్లుడు జంప్

సారాంశం

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది.. కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేయడమే కాకుండా.. హత్య వార్తను ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడో కసాయి భర్త. 

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది.. కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హత్య చేయడమే కాకుండా.. హత్య వార్తను ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడో కసాయి భర్త. వివరాల్లోకి వెళితే.. సత్నాకు చెందిన మోనూ అతని భార్య పూజ మధ్య నిన్న రాత్రి వివాదం జరిగింది.

ఈ సమయంలో ఆగ్రహానికి గురైన మోనూ భార్యను గొంతునులిమి అనంతరం రాయితో కొట్టి హతమార్చాడు. అనంతరం భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి ‘‘ మా ఇంట్లో మీ అమ్మాయి చనిపోయి పడివుంది.. వచ్చి తీసుకెళ్లండి’’ అంటూ చెప్పాడు..

దీంతో ఆందోళనకు గురైన అత్తమామలు కంగారుగా మోను ఇంటికి పరిగెత్తుకొచ్చారు.. ఇంట్లో తమ కుమార్తె రక్తపు మడుగులో పడివుంది.. అయితే అప్పటికీ మోను పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. మోనుని వెతికి పట్టుకున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Government Scheme : 8వ తరగతి పాసైతే చాలు, ఫ్రీగా రూ.48000 పొందండి.. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?
నేపాల్లో వరదల మధ్య గర్భిణిని కాపాడి హెలీకాఫ్టర్లో తరలించిన రెస్క్యూ టీమ్ Nepal Rescue Pregnant Woman