రైతులపై సుప్రీంకోర్ట్ ఆగ్రహం.. రంగంలోకి పోలీసులు, ఢిల్లీ బోర్డర్‌లో బారికేడ్ల తొలగింపు

By Siva KodatiFirst Published Oct 29, 2021, 10:44 AM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీ (Delhi) సరిహద్దుల్లోని రోడ్లపై ఏర్పాటు చేసిన బారికేడ్లను (barricades) తొలగిస్తున్నారు పోలీసులు. మేకులు కొట్టిన భారీ కాంక్రీట్ బ్లాక్స్‌ని బుల్డొజర్లతో పక్కకు జరుపుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల శిబిరాల వల్ల ఆయా మార్గాల్లో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో నివసించే వారితో పాటు అటు తరచుగా ప్రయాణించే వారు నానా ఇబ్బందులు పడుతున్నారు.

దేశ రాజధాని ఢిల్లీ (Delhi) సరిహద్దుల్లోని రోడ్లపై ఏర్పాటు చేసిన బారికేడ్లను (barricades) తొలగిస్తున్నారు పోలీసులు. మేకులు కొట్టిన భారీ కాంక్రీట్ బ్లాక్స్‌ని బుల్డొజర్లతో పక్కకు జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను (farm laws) వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన రైతులను ఢిల్లీ సరిహద్దుల వద్దే అడ్డుకున్నారు పోలీసులు. రైతుల వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా టిక్రీ, ఘజీపూర్ సరిహద్దుల వద్ద భారీ స్థాయిలో బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. దీంతో రైతులు సరిహద్దుల్లోనే టెంట్లు వేసుకుని వుంటూ తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. 

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల శిబిరాల వల్ల ఆయా మార్గాల్లో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో నివసించే వారితో పాటు అటు తరచుగా ప్రయాణించే వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైతుల్ని అక్కడి నుంచి ఖాళీ చేయించి.. రోడ్లను తెరవాలంటూ సుప్రీంకోర్ట్‌ను (supreme court) ఆశ్రయించారు. దీంతో రైతులకు నిరసన తెలిపే హక్కు వున్నా.. నిరవధికంగా రోడ్లను నిర్బంధించడానికి వీల్లేదని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. అయితే తాము రోడ్లపై ఎలాంటి అడ్డంకులు కల్పించలేదని .. ఆ పని చేస్తోందని పోలీసులని కోర్టుకు తెలిపారు రైతులు (farmers) . 

Also Read:రైతుల ఆందోళనలతో వెనక్కి తగ్గిన కేంద్రం.. ఆ నిర్ణయాన్ని మార్చుకున్న ప్రభుత్వం

సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు హర్యానా-ఢిల్లీల మధ్య గల టిక్రీ సరిహద్దు (tikri border) , అలాగే యూపీ - ఢిల్లీ సరిహద్దు ఘాజీపూర్‌ల (ghazipur border) వద్ద గల బారీకేడ్లను తొలగించే పని ప్రారంభించారు అధికారులు. నిన్న రైతుల ప్రతినిధుల బృందంతో కలిసి సరిహద్దుల్లో బారికేడ్లను ఏర్పాటు చేసిన ప్రాంతాలను పరిశీలించారు  పోలీసులు. అనంతరం రాత్రి నుంచి బారికేడ్లను తొలగించే  పని మొదలుపెట్టారు. 

కాగా.. ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో రైతులు ఆందోళ చేస్తున్న  వేదిక వద్ద (farmers protest site) అక్టోబర్ 22న మరోసారి  కలకలం రేగింది. సిక్కుల పవిత్ర గ్రంథాన్ని అవమానపరిచాడనే ఆరోపణలతో ఓ  వ్యక్తిని నిహాంగ్ సిక్కులు దారుణంగా  హత్య చేసిన  సంగతి తెలిసిందే.  అయితే ఈ ఘటన మరవక  ముందే.. రైతులు  ఆందోళ చేస్తున్న చోటే  మరో వ్యక్తిపై దాడి జరిగింది. ఇందుకు సంబంధించి నిహంగ్  గ్రూప్‌కు చెందిన ఓ వ్యక్తిని  పోలీసులు  అరెస్ట్ చేశాడు. 

ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘు సరిహద్దుల్లోని రైతుల నిరసన స్థలం వద్ద నిహాంగ్ వర్గానికి చెందిన సభ్యులు హింసాత్మక  చర్యలకు పాల్పడం  ఇది రెండోసారి. ఇటీవల దళిత రోజువారీ కూలీ కార్మికుడు లఖ్‌బీర్ సింగ్ ఆ ప్రదేశంలో దారుణంగా హత్య చేయబడ్డాడు. తమ పవిత్ర గ్రంథాన్ని అవమానపరిచాడని  నిహాంగ సిక్కులు  ఈ దారుణానికి పాల్పడ్డారు. అతడి చేతులు నరికివేసి  అత్యంత  క్రూరంగా హత్య చేశారు.  అనంతరం  అతని  మృతదేహాన్ని  పోలీసు బారికేడ్లకు కట్టివేశారు. దీనిపై రైతు సంఘాల నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ చర్యకు పాల్పడిన  వారిని  కఠినంగా శిక్షించాలని  డిమాండ్  చేశారు. 

click me!