ఒడిషాలో ఐదుగురు మావోలు హతం.. తప్పించుకున్న అగ్రనేత రణ్‌‌దేవ్

By sivanagaprasad kodatiFirst Published Nov 5, 2018, 10:55 AM IST
Highlights

మావోలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది...ఒడిషాలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.. మల్కన్‌గిరి జిల్లా బెజ్జింగివాడ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోలకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. 

మావోలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది...ఒడిషాలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది.. మల్కన్‌గిరి జిల్లా బెజ్జింగివాడ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోలకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు.

పప్పులూరు అడవుల్లో మావోయిస్టులు శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని మకాం వేశారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు తారసపటడంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు.

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత రణ్‌దేవ్ ఎన్‌కౌంటర్ ‌నుంచి తప్పించుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఆయన కోసం భద్రతా దళాలు కూంబింగ్ జరుపుతున్నాయి. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలను, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు. మరణించిన మావోల వివరాలు తెలియాల్సి వుంది.. మృతదేహాలను మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి తరలించారు. 

కిడారి, సోమల హత్య.. స్పందించిన మావోయిస్టులు

కిడారి, సోమ హత్య: ఒక్క రోజు ముందే వచ్చిన మావోయిస్టులు

పాండవుల వ్యూహాన్ని అమలు చేస్తోన్న మావోయిస్టులు

అరకు ఘటన: ఆ ఇద్దరే మావోలకు సమాచారమిచ్చారా?

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే

చంద్రబాబును వెన్నాడుతున్న మావోయిస్టులు

ఎమ్మెల్యే హత్య: కిడారిని ట్రాప్ చేసి.. బంధువులే నమ్మకద్రోహం

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

ఎమ్మెల్యే హత్య: పక్కా ప్లాన్, చలపతి స్కెచ్

మా టార్గెట్ జవాన్లే.. డీడీ కెమెరామన్‌ను కావాలని చంపలేదు: మావోలు

మావోల దాడి...చనిపోతూ విధులు నిర్వహించిన డీడీ కెమెరామన్

click me!