గుండెపోటుతో ... బీజేపీ అభ్యర్థి మృతి

Published : Nov 05, 2018, 10:23 AM IST
గుండెపోటుతో ... బీజేపీ అభ్యర్థి మృతి

సారాంశం

దేవీసింగ్ స్థానంలో మరో అభ్యర్థిని నియమించేందుకు పార్టీ క్యాడర్ సన్నాహాలు చేస్తోంది.  

మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే దేవీసింగ్ పటేల్ గుండెపోటుతో మృతి చెందారు. త్వరలో మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. రాజ్ పూర్ నియోజకవర్గానికి ఈయనను బీజేపీ అభ్యర్థిగా కూడా నియమించారు. ఇలాంటి తరుణంలో ఆయన అకస్మాత్తుగా కన్నమూశారు. దీంతో.. పార్టీ నేతలు షాక్ కి గురయ్యారు. దేవీసింగ్ మద్దతు దారులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దేవీసింగ్ స్థానంలో మరో అభ్యర్థిని నియమించేందుకు పార్టీ క్యాడర్ సన్నాహాలు చేస్తోంది.

పటేల్ మధ్యప్రదేశ్ అసెంబ్లీకి మూడు సార్లు ఎన్నికయ్యారు. 1989లో మొట్టమొదటి సారి ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యే అయిన పటేల్ సోమవారం ఉదయం గుండెపోటుతో కుప్పకూలిపోయారు. పటేల్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. పటేల్ అంత్యక్రియలు బంద్ర కచ్చా గ్రామంలో జరుపనున్నారు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..