అల్వార్ గ్యాంగ్ రేప్ కేసు... పోలీసులకు చిక్కులు

By telugu teamFirst Published May 11, 2019, 11:42 AM IST
Highlights

ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ లో ఓ వివాహిత గ్యాంగ్ రేప్ కి గురైన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా... ఈ కేసుకు సంబంధించి అక్కడి పోలీసులకు చిక్కులు తప్పడం లేదు.

ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ లో ఓ వివాహిత గ్యాంగ్ రేప్ కి గురైన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా... ఈ కేసుకు సంబంధించి అక్కడి పోలీసులకు చిక్కులు తప్పడం లేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ..  ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేశారు. కాగా.. మిగిలిన పోలీసులపై క్రిమినల్ కేసు పెట్టాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ డిమాండ్ చేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గత నెల 26న మోటార్ సైకిల్‌పై వెళ్తున్న దంపతులను థానాగాజీ-అల్వార్ రోడ్డులో దుండగులు అడ్డగించారు. భర్తను చితకబాదారు. భర్త కళ్లెదుటే భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. లైంగిక దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు థానాగాజీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో, ఎస్పీని సంప్రదించగా, ఎన్నికల సన్నాహాల్లో ఉన్నామని, ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆగాలని బదులిచ్చారని బాధితురాలి భర్త ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్ కూడా ఈ నెల 2న నమోదు చేశారని చెప్పారు. ఏప్రిల్ 30న ఓ నిందితుడు తనకు ఫోన్ చేసి డబ్బులివ్వాలని డిమాండ్ చేశాడని చెప్పారు.

లేకపోతే వీడియోను వాట్సాప్‌లో సర్క్యులేట్ చేస్తానని బెదిరించాడని తెలిపారు.  దీనిపై  తన సోదరుడు ఎస్పీకి చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఈ నెల 4న దుండగులు వీడియోను సర్క్యులేట్ చేశారు. దీంతో వీడియో వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న ప్రతిపక్షాలు... అధికార పార్టీపై విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. 

దీంతో... స్పందించిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహించిన ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. కాగా.. తాజాగా మానవహక్కుల సంఘం వైస్ ఛైర్మన్ మురగన్ మాట్లాడుతూ... ఈ కేసులో పోలీసులు ఇప్పటికీ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సెక్షన్ 4 ఎస్సీ, ఎస్సీ కేసు కింద పోలీసులపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లోగా మహిళ గ్యాంగ్ రేపు కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని... ఈ కేసును ప్రతిరోజూ మానిటర్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే.. నిజంగానే పోలీసులపై క్రిమినల్ కేసు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. 

ఇదిలా ఉండగా.... ఈ ఘటన అనంతరం బాధితురాలికి తక్షణ పరిహారం కింద రూ.4.12లక్షలు అందజేశారు. ఈ కేసులో న్యాయం కోసం.. బాధితులు పోరాటం కొనసాగిస్తున్నారు. 

click me!