కోకాకోలాపై నిషేధం విధించిన జార్జి ఫెర్నాండెజ్

By sivanagaprasad kodatiFirst Published Jan 29, 2019, 10:51 AM IST
Highlights

కేంద్ర మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ కన్నుమూతతో దేశ రాజకీయాల్లో ఒక శకం ముగిసిందని అంటున్నారు విశ్లేషకులు. కార్మిక నేతగా ప్రస్థానాన్ని ప్రారంభించి దేశ రక్షణ శాఖకు సారథ్యం వహించే స్థాయికి ఆయన చేరుకున్నారు. 

కేంద్ర మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ కన్నుమూతతో దేశ రాజకీయాల్లో ఒక శకం ముగిసిందని అంటున్నారు విశ్లేషకులు. కార్మిక నేతగా ప్రస్థానాన్ని ప్రారంభించి దేశ రక్షణ శాఖకు సారథ్యం వహించే స్థాయికి ఆయన చేరుకున్నారు.

జనతాదళ్ పార్టీలో కీలక భూమిక పోషించిన ఆయన, సమతా పార్టీని స్థాపించారు. పట్టుదల, మొండితనంతో పాటు ముక్కుసూటితనంగా ముందుకు వెళ్తారని జార్జి సన్నిహితులు చెప్పేవారు. 1949లో 19 ఏళ్ల వయసులోనే ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు.

ఈ క్రమంలో ఆయనకు 1950-60 మధ్య రైల్వే యూనియన్లతో ఫెర్నాండెజ్‌కు అనుబంధం ఏర్పడింది. 1967లో దక్షిణ ముంబై నుంచి మొదటిసారి లోక్‌‌సభకు ఎన్నికయ్యారు. 1974లో రైల్వే సమ్మెకు సారథ్యం వహించిన జార్జి సంచలనం సృష్టించాడు.

1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమెర్జెన్సీ విధించడంతో కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్నారు. 1976లో బరోడా డైన‌మెట్ కేసులో ఫెర్నాండెజ్‌ను నాటి కేంద్రప్రభుత్వం అరెస్ట్ చేసింది.

1977లో జనతాపార్టీ అభ్యర్థిగా బీహార్‌లోని ముజఫర్‌నగర్ నుంచి ఎన్నికై మొరార్జీ దేశాయ్ కేబినెట్‌లో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి ఐబీఎం, కోకా కోలా వంటి దిగ్గజ బహుళజాతి సంస్థలపై నిషేధం విధించి సంచలనం సృష్టించారు.

1989 నుంచి 90 వరకు వీపీ సింగ్ మంత్రివర్గంలో రైల్వేశాఖ మంత్రిగా పనిచేశారు. రైల్వే మంత్రిగా తన జన్మభూమి అయిన దక్షిణ కన్నడ జిల్లాల్లో కొంకణ్ రైల్వే కోసం తీవ్రంగా కృషి చేశారు.

1998 నుంచి 2004 వరకు వాజ్‌పేయ్ కేబినెట్‌లో రక్షణ మంత్రిగా కీలక బాధ్యతలు స్వీకరించి సంచలనాలను నమోదుచేశారు. అగ్రరాజ్యాల నిఘాకు అందకుండా భారత్ పోఖ్రాన్ అణు పరీక్షల్లో విజయం సాధించడంలో ఫెర్నాండెజ్ కీలక పాత్ర పోషించారు. అలాగే 1999 కార్గిల్ యుద్ధంలో కఠిన నిర్ణయాలు తీసుకుని శత్రు మూకలను తరిమి తరిమి కొట్టారు. 

బ్రేకింగ్: మాజీ రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్ కన్నుమూత

click me!