ఆర్మీకి సుప్రీంకోర్టు వార్నింగ్.. మరో 11 మంది మహిళలకు శాశ్వత కమిషన్‌కు ఆర్మీ అంగీకారం

By telugu teamFirst Published Nov 12, 2021, 4:04 PM IST
Highlights

సుప్రీంకోర్టులో మహిళలకు మరో విజయం దక్కింది. మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ కల్పించాలని సుప్రీంకోర్టు ఇది వరకే ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. మహిళా అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లు విచారిస్తూ తమ ఆదేశాలు అమలు చేయకుంటే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని వార్నింగ్ ఇచ్చింది. దీంతో పది రోజుల్లోనే 11 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ స్టేటస్ కల్పిస్తామని కేంద్రం తెలిపింది.
 

న్యూఢిల్లీ: Supreme Courtలో మహిళలకు మరో విజయం దక్కింది. Armyలో శాశ్వత కమిషన్‌(Permanent Commission) కోసం ఏళ్ల తరబడి వారు అత్యున్నత న్యాయస్థానంలో పోరాడుతున్నారు. గతేడాది ఫిబ్రవరిలోనే ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ హోదా ఇవ్వాలని ఆదేశించింది. కానీ, ఈ ఆదేశాలు సరిగ్గా అమలు కావడం లేదు. దీనిపై కొందరు మహిళా అధికారులు మరోసారి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. శాశ్వత కమిషన్ పొందడానికి తమకు అన్ని అర్హతలు ఉన్నా.. ఆ హోదా కల్పించడం లేదని పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారిస్తూ ఆర్మీకి వార్నింగ్ ఇచ్చింది. తమ గత ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని, కోర్టు ధిక్కరణగా పరిగణించమంటారా? అంటూ ప్రశ్నించింది. అనంతరం ఆర్మీ కోర్టుకెక్కిన ఆ 11 మంది మహిళలకూ శాశ్వత కమిషన్ సర్వీసు స్టేటస్ కల్పిస్తామని తెలిపింది.

మూడు వారాల్లో 11 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా కల్పించాలని ఆదేశించింది. అంతేకాదు, శాశ్వత కమిషన్ హోదాకు అర్హులైన మహిళలందరికీ ఈ హోదా నిర్దేశిత గడువులోపు ఇవ్వాలని స్పష్టం చేసింది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీనికి పది రోజుల్లోగా ఆ 11 మంది మహిళలకు శాశ్వత కమిషన్ హోదా కల్పిస్తామని కేంద్రం తెలిపింది.

Also Read: 39 మంది మ‌హిళా ఆర్మీ ఆఫీస‌ర్ల‌కు శాశ్వత క‌మిష‌న్.. సుప్రీం కోర్టులో ఫలించిన పోరాటం..

ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ కింద సేవలందించే వారు కేవలం పదేళ్లు మాత్రమే ఉద్యోగంలో ఉంటారు. ఆ తర్వాత దిగి పోవాల్సిందే. లేదా.. ఆ తర్వాత పర్మినెంట్ కమిషన్‌కు ఎంపికైతే.. వారి రిటైర్‌మెంట్ వరకు సేవలు అందించవచ్చు. పర్మినెంట్ కమిషన్ హోదా పొందలేకపోతే.. మరో నాలుగేళ్లు షార్ట్ సర్వీస్ కమిషన్ కిందనే ఉద్యోగం చేసుకోవచ్చు.

అర్హులైన మహిళా ఉద్యోగులకు శాశ్వత కమిషన్ హోదా కల్పించాలని ఈ ఏడాది మార్చిలోనూ సుప్రీంకోర్టు భారత ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఈ ఆదేశాలను అమలు చేయడం లేదని, తమకు అన్ని అర్హతలున్నా.. శాశ్వత కమిషన్ కల్పించడం లేదని ఆరోపిస్తూ 71 మంది షార్ట్ సర్వీస్ కమిషన్ మహిళా ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయ పోరాటం  చేస్తున్న ఈ 71 మందిలో ఎవ‌రినీ రిలీవ్ చేయ‌కూడ‌ద‌ని అక్టోబర్ 1వ తేదీన సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ అంశంపై జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ బీవీ నాగ‌రత్న‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రుపుతోంది. సీనియర్ లాయర్లు వి మోహన, హుజెఫా అహ్మది మరియు మీనాక్షి అరోరా.. మహిళా ఆర్మీ అధికారుల తరఫున వాదనలు  వినిపించారు.

Also Read: కేంద్రం చరిత్రాత్మక నిర్ణయం.. ఎన్‌డీఏలోకి మహిళలకు అనుమతి.. శాశ్వత కమిషన్‌కు గ్రీన్ సిగ్నల్

ఈ మ‌హిళా అధికారుల‌కు ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డం కొద్ది నెలల  కిందట సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే 39 మంది మహిళా అధికారుల‌కు శాశ్వత క‌మిష‌న్ ఇచ్చే ప్ర‌క్రియ‌ను మూడు నెల‌ల్లో పూర్తిచేయాల‌ని కేంద్రాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

click me!