సీబీఐ వివాదం: రాత్రికి రాత్రే ఎందుకు సెలవిచ్చారు.. కేంద్రంపై సుప్రీం ఫైర్

By sivanagaprasad kodatiFirst Published Dec 6, 2018, 2:45 PM IST
Highlights

కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ వివాదంలో సుప్రీం కోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తనను కేంద్రం సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది


కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ వివాదంలో సుప్రీం కోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తనను కేంద్రం సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ... గత జూలై నుంచి వారిద్దరిని భరిస్తున్నామని చెప్పినప్పుడు... మరి ఇంత అకస్మాత్తుగా ఎందుకు సెలవుపై పంపిచారని కేంద్రాన్ని ప్రశ్నించారు. సీబీఐ డైరెక్టర్‌పై ఇలాంటి కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు సెలక్షన్ కమిటీని ఎందుకు సంప్రదించలేదని ఆగ్రహం వ్యక్తం చఏశారు..

కేంద్ర విజిలెన్స్ కమిషన్, అలోక్ వర్మ, ఆస్థానాలపై చర్యలు తీసుకోవడానికి ఏర్పడిన పరిణామాలు రాత్రికి రాత్రి ఏర్పడలేదు.. మీరు అకస్మాత్తుగా నిర్ణంయ తీసుకోవడానికి అసలు కారణం అది కాదు అని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు.

ఇదే పిటిషన్‌పై బుధవారం జరిగిన విచారణలో.. అనివార్య కారణాల వల్ల వారిని సెలవుపై పంపాలని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అటార్నీ జనరల్ ధర్మాసనానికి వెల్లడించారు. వారు గత కొన్ని నెలలుగా ఘర్షణ పడటంతో సీబీఐ బాహాటంగా అపహాస్యం పాలైందని.. అందుకే తాము కలగజేసుకోవాల్సి వచ్చిందని కేంద్రం తెలిపింది.

మరోవైపు సీబీఐ కేసుల దర్యాప్తునకు బదులుగా వారే ఒకరిపై ఒకరు దర్యాప్తు చేసుకుంటున్నారని కేంద్ర విజిలెన్స్ కమిషన్ సుప్రీంకోర్టుకు తెలిపింది. సీబీఐ అంశంపై సీవీసీ దర్యాప్తు చేపట్టిందని.. కానీ అలోక్ వర్మ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కొన్ని నెలల పాటు ఇవ్వలేదని సీవీసీ వెల్లడించింది. 

మోడీకి షాక్.. సుప్రీంను ఆశ్రయించిన మరో సీబీఐ అధికారి

సీబీఐలో అంతర్యుద్ధం: సానా సతీశ్‌కు రక్షణ కల్పిస్తాం.. కానీ

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌కు సుప్రీం షాక్: విధాన నిర్ణయాలొద్దు

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఇంటి వద్ద కలకలం.. ఆ నలుగురు ఎవరు..?

అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు

అలోక్ వర్మ Vs రాకేష్ ఆస్థానా: వర్మ సహకరించలేదు: సీవీసీ

రాకేష్ Vs అలోక్‌వర్మ: అందుకే సెలవుపై పంపాం: జైట్లీ

సీబీఐ చీఫ్‌గా రెండో తెలుగోడు: ఎవరీ నాగేశ్వరరావు

దేశచరిత్రలోనే తొలిసారిగా.. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో సోదాలు

సీబీఐ చరిత్రలోనే తొలిసారి.. లంచం కేసులో సొంత డైరెక్టర్‌పైనే ఎఫ్ఐఆర్


 

click me!