చెరువులో హెచ్ఐవీ సోకిన మహిళ చనిపోయిందని...

By ramya neerukondaFirst Published Dec 6, 2018, 12:13 PM IST
Highlights

ఆమె మృతదేహాన్ని అప్పటికే చెరువులోని చేపలు సగానికి పైగా తినేశాయి. అయితే.. చనిపోయిన మహిళకు హెచ్ఐవీ సోకిందని.. కాబట్టి.. ఆ నీటిని తాము తాగమంటూ.. అక్కడి గ్రామస్థులు ఆందోళన చేయడం మొదలుపెట్టారు.

హెచ్ఐవీ సోకిన మహిళ  చెరువులో పడి చనిపోయిందని.. ఆ చెరువులోని నీటిని మొత్తాన్ని ఖాళీ చేశారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హుబ్బాలి జిల్లా మోరబ్ జిల్లాలో 23ఎకరాల మంచినీటి చెరవు ఉంది. అయితే.. గత నెల 29వ తేదీన ఓ మహిళ మృతదేహం ఆ చెరువులో లభ్యమైంది. 

ఆమె మృతదేహాన్ని అప్పటికే చెరువులోని చేపలు సగానికి పైగా తినేశాయి. అయితే.. చనిపోయిన మహిళకు హెచ్ఐవీ సోకిందని.. కాబట్టి.. ఆ నీటిని తాము తాగమంటూ.. అక్కడి గ్రామస్థులు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. ఈ చెరువులోని నీటిని మొత్తాన్ని ఖాళీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆ నీటిని తాగితే.. తమకు కూడా హెచ్ఐవీ సోకుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. 

అయితే.. చెరువులో నీటిని తాము పరిశీలించామని.. అలాంటి వైరస్ నీటిలో కలవలేదని అధికారులు స్థానికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా స్థానికులు వినిపించుకోపోవడంతో.. అధికారులు చేసేదేమీ లేక.. దాదాపు 20ట్యూబ్ లతో నీటిని చెరువులో నుంచి ఖాళీ చేస్తున్నారు.

మరో మంచినీటి చెరువు నుంచి నీటిని తీసుకువచ్చి... చెరువులో నింపుతామని అధికారులు స్థానికులకు హామీ ఇచ్చారు. అయితే.. హెచ్ఐవీ వైరస్.. నీరు, గాలి వంటి వాటి ద్వారా సోకదని ఈ సందర్హంగా మరోసారి అధికారులకు చెప్పే ప్రయత్నం చేశారు. 
 

click me!