బాబ్రీ మసీదు కూల్చివేత: ఎప్పుడు ఏం జరిగిందంటే?

By narsimha lodeFirst Published Sep 30, 2020, 11:23 AM IST
Highlights

బాబ్రీ మసీదు కేసులో  సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం నాడు తీర్పును వెలువరించనుంది. 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఇప్పటివరకు ఏం జరిగాయో ఒక్కసారి పరిశీలిద్దాం.

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కేసులో  సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం నాడు తీర్పును వెలువరించనుంది. 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఇప్పటివరకు ఏం జరిగాయో ఒక్కసారి పరిశీలిద్దాం.

బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో బీజేపీ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహార్ జోషీ, ఉమా భారతి లపై ఆరోపణలు ఉన్నాయి.

1992 డిసెంబర్ 6: బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు.

1993 డిసెంబర్:  బాబ్రీ మసీదు కూల్చివేతపై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. వీటిలో ఒకటి బాబ్రీ మసీదు కూల్చివేతలో కర సేవకుల పాత్రపై... మరోకటి బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాల గురించి... ఈ ఛార్జీషీట్లలో ప్రస్తావించారు.

2001 మే: ప్రత్యేక సీబీఐ కోర్టు బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహార్ జోషీ, ఉమా భారతి, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే సహా పలువురిపై విచారణను విరమించుకొంది.

2004 నవంబర్:  అలహాబాద్ హైకోర్టు  లక్నో బెంచ్ ముందు సీబీఐ ఈ విషయాన్ని సవాల్ చేసింది. టెక్నికల్ అంశాలను సాకుగా చూపి బీజేపీ నేతలపై విచారణను విరమించుకొందని సీబీఐ తెలిపింది.

also read:బాబ్రీ మసీదు కూల్చివేత: సీబీఐ ప్రత్యేక కోర్టు నేడే తీర్పు

2009 జూన్: బాబ్రీ మసీదు కూల్చివేతపై అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన లిబర్హాన్ కమిషన్ 17 ఏళ్ల తర్వాత తన నివేదికను సమర్పించింది. 68 మందిని దీనికి బాధ్యులుగా కమిషన్ ప్రకటించింది. ఇందులో ఎక్కువగా బీజేపీ నేతలున్నారు.

2010 సెప్టెంబర్ : రెండు ఎప్ఐఆర్ ల ఆధారంగా కేసులను విడి విడిగా విచారించనున్నట్టుగా దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను  అలహాబాద్ హైకోర్టు సమర్ధించింది.

2012 మార్చి: అన్ని కేసులకు సాధారణ విచారణ కోరుతూ సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

2017 ఏప్రిల్: ఎల్ కే అద్వానీతో పాటు ఇతర నాయకులపై ఉన్న కుట్ర ఆరోపణలను సుప్రీంకోర్టు పునరుద్దరించింది.  ఈ కేసును రోజువారీ పద్దతిలో విచారించాలని కోరింది. కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తిని బదిలీ చేయబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సెప్టెంబర్ 2020::లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బాబ్రీ మసీదు కూల్చివేతపై తీర్పు ఇవ్వనుంది.

click me!