హర్యానాలో దారుణం.. యువకుడిని కిడ్నాప్ చేసి, చెరకు తోటలో బంధించి లైంగిక వేధింపులు.. వీడియో తీసి మరీ..

By Asianet NewsFirst Published Feb 3, 2023, 4:23 PM IST
Highlights

ఓ యువకుడిపై పలువురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దారుణాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. 

ఓ యువకుడిని కిడ్నాప్ చేసి, చెరకు తోటలో బంధించి అతడిపై పలువురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ లో వెలుగులోకి వచ్చింది. ఈ దుశ్చర్యను నిందితులు వీడియో కూడా తీశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. 

73 ఏళ్లలో తొలిసారిగా సుప్రీంకోర్టు వ్యవస్థాపక దినోత్సవం.. ముఖ్య అతిథిగా సింగ‌పూర్ సీజే

బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాల్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు స్థానికంగా ఓ సెలూన్ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే జనవరి 24వ తేదీన ఆ యువకుడు ఇంటి వద్ద ఉండగా కొంత మంది నుంచి ఫోన్ వచ్చింది. సెలూన్ కు రావాలని కోరారు. దీంతో ఆ యువకుడు ఇంటి నుంచి బయలుదేరాడు. ఈ సమయంలో కొంత మంది వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేసి, కారులో ఎక్కించుకొని వెళ్లారు. అనంతరం అతడిని చెరుకు తోటలోకి తీసుకెళ్లి చితకబాదారు. అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితుడిని 7-8 గంటల పాటు బందించి ఉంచారు. అతడి వద్ద ఉన్న రూ.5 వేలను కూడా లాక్కున్నారు. 

ఈ దారుణాన్ని దుండగులు వీడియో తీశారు. ఈ ఘటనను ఎవరికైనా చెబితే చంపేస్తామని, వీడియోను సోషల్ మీడియోలో పోస్టు చేసి వైరల్ చేస్తామని హెచ్చరించారు. దీంతో యవకుడు ఆందోళనకు గురయ్యాడు. కానీ కొంత కాలం తరువాత నిందితులు దానిని బయటకు విడుదల చేశారు. ఈ వీడియోను బాధితుడి కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 1వ తేదీన సోషల్ మీడియాలో చూశారు. అనంతరం బాధితుడు నుంచి వివరాలు తెలుసుకున్నారు. 

ట్రాక్ మార్చిన కేటుగాళ్లు.. నకిలీ నోట్లు కాదు, నకిలీ కాయిన్స్ తయారీ.. 9 లక్షల ఫేక్ కాయిన్స్ సీజ్

తరువాత దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ దుండగులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే బాధితుడు ఫిర్యాదు మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో కూడా పోలీసులకు చిక్కింది. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఇంద్రి పోలీసులు తెలిపారు.

కేరళకు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో మంటలు.. అబుదాబిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఇలాంటి ఘటనే గతేడాది డిసెంబర్ 15వ తేదీన ఢిల్లీలోని సరాయ్ రోహిల్లా ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. 2 ఏళ్ల బాలుడిపై మదర్సా ఉలేమా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితుడిని ఎండీ ఇస్రాన్‌గా పోలీసులు గుర్తించారు. అతడిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్లు 377, 506 కింద పోలీసులు ఎండీ ఇస్రాన్‌పై కేసు నమోదు చేశారు. అలాగే పోక్సో (లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు 12 ఏళ్ల బాలుడిని మత్తు అందించి, అపస్మార స్థితిలోకి వెళ్లిపోయాక చాలా సార్లు అసహజ సెక్స్‌కు పాల్పడ్డాడని డీసీపీ సాగర్ సింగ్ కల్సి చెప్పారు. 

click me!