"కారుణ్య నియామకం హ‌క్కు కాదు".. Supreme Court కీల‌క వ్యాఖ్య‌లు

By Rajesh KFirst Published Dec 17, 2021, 3:14 PM IST
Highlights

కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్రభుత్వోద్యోగి మరణిస్తే.. అత‌ని కుటుంబ సభ్యులకు ఇచ్చే ఉద్యోగ నియామకంపై సుప్రీంకోర్టు ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్త‌వించింది.  కారుణ్య నియామకం హక్కు కాదని.. అది సంపూర్ణ హక్కు కాదు  అని వ్యాఖ్యానించింది. 
 

Appointment on compassionate:  కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.  విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న  ప్రభుత్వోద్యోగి (అతడు లేక ఆమె) మరణిస్తే.. అత‌ని కుటుంబ సభ్యులకు ఇచ్చే ఉద్యోగ నియామకంపై దేశ సర్వోన్న‌త న్యాయ స్థానం పలు కీల‌క అంశాల‌ను లేవ‌నెత్తింది. కారుణ్య నియామకం హక్కు కాదని.. అది సంపూర్ణ హక్కు కాదు’ అని వ్యాఖ్యానించింది. 

ఇటువంటి సందర్భాల్లో మరణించిన వ్యక్తి కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు, మ‌రణించిన వ్య‌క్తి మీద త‌న కుటుంబం ఏ మేరకు ఆధారపడి ఉన్న‌ది. ఆయ‌న కుటుంబ స‌భ్యులు ప‌రిస్థితేమిటి అనే అంశాల‌ను కూడా ప‌రిగ‌ణించాల‌ని, ఆ త‌రువాత‌నే కారుణ్యనియామకాన్ని చేపట్టాల్సి ఉంటుందని జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ల  సుప్రీంకోర్టు  ధర్మాసనం స్పష్టం చేసింది.

Read Also: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం... వైసిపితో కలిసి నడిచేందుకు సిద్దమే..: పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

సర్వీస్‌ నిబంధనల్లో కారుణ్య నియామకం కూడా ఒక్కటై, ఉద్యోగి మరణించిన సందర్భాల్లో ఆటోమేటిక్‌గా, ఎలాంటి పరిశీలనలు జరపకుండా కారుణ్య నియామకం చేపడితే.. అది సంపూర్ణ చట్టబద్ధ హక్కు అవుతుందని  సుప్రీంకోర్టు  తెలిపింది. కానీ, ప్రస్తుతం కారుణ్య నియామకం అలా చేయ‌డం స‌రికాద‌ని, వివిధ ఆంశాల‌ను కూడా ప‌రిగ‌ణన‌లోకి తీసుకోవాల‌ని, ప్రధానంగా.. ఆ కుటుంబ ఆర్థిక స్థితిగతులు, సదరు ఉద్యోగికి సంబంధించిన కుటుంబం ఏ మేరకు ఆధారపడ్డారు? ఆ ఉద్యోగమే వారికి పూర్తి ఆధారమా? లేక వారు ఏదైనా వృత్తి, వ్యాపారాల్లో ఉన్నారా? వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే కారుణ్యనియామకాన్ని చేపట్టాలని,  జ‌స్టిస్ హేమంత్ గుప్తా, వి.రామసుబ్రమణ్యంలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 

Read Also: తిరుపతిలో టీడీపీ ఎమ్మెల్యేలు, అమరావతి రైతుల పూజలు.
 
ఈ మేరకు ..  భీమేష్ సోదరి కర్ణాట‌క ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్నారు, డిసెంబర్ 8, 2010న మరణించారు. ఆమె కుటుంబంలో తల్లి, ఇద్దరు సోదరులు మరియు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. భీమేష్ కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అవివాహిత మహిళా కార్మికుడిపై ఆధారపడిన ఏ ఒక్కరికీ ఉద్యోగం కల్పించడం లేదని పేర్కొంటూ సంబంధిత శాఖ దరఖాస్తును తిరస్కరించింది. 

Read Also: అమరావతి రైతుల సభ : తిరుమలకు చేరుకున్న చంద్రబాబు నాయుడు

అయితే 2012లో ఇలాంటి కేసుల్లో నిబంధనలను సవరిస్తూ కారుణ్య నియామకం ఇచ్చేలా నిబంధన పెట్టారు. దీంతో భీమేష్  అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ధర్మాసనం ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అక్కడి నుంచి కూడా భీమేష్ కు అనుకూలంగా నిర్ణయం వచ్చింది. ట్రిబ్యునల్‌ తీర్పునే కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో..ఆ రాష్ట్ర విద్యాశాఖ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కారుణ్య నియామకం సంపూర్ణ హక్కు కాదని సదరు ఉద్యోగి కుటుంబ ఆర్థిక పరిస్థితులతో పాటు పలు అంశాలను పరిశీలించాల్సిన తరువాత కారుణ్య నియామకం చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

click me!