MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • అమరావతి రైతుల సభ : తిరుమలకు చేరుకున్న చంద్రబాబు నాయుడు

అమరావతి రైతుల సభ : తిరుమలకు చేరుకున్న చంద్రబాబు నాయుడు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిధిగృహం వద్ద బాబుకు టీటీడీ రిసెప్షన్ డిప్యూటీ ఈవో లోకనాధం స్వాగతం పలికారు. మరికాసేపట్లో శ్రీవారిని బాబు దర్శించుకోనున్నారు. దర్శనాంతరం తిరుపతిలో జరుగుతున్న అమరావతి పరిరక్షణ సభకు టీడీపీ అధినేత వెళ్ళనున్నారు.

2 Min read
Bukka Sumabala
Published : Dec 17 2021, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Chandrababu Naidu reached to Tirupathi

Chandrababu Naidu reached to Tirupathi

తిరుమల: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిధిగృహం వద్ద బాబుకు టీటీడీ రిసెప్షన్ డిప్యూటీ ఈవో లోకనాధం స్వాగతం పలికారు. మరికాసేపట్లో శ్రీవారిని బాబు దర్శించుకోనున్నారు. దర్శనాంతరం తిరుపతిలో జరుగుతున్న అమరావతి పరిరక్షణ సభకు టీడీపీ అధినేత వెళ్ళనున్నారు.

24
Chandrababu Naidu reached to Tirupathi

Chandrababu Naidu reached to Tirupathi

ఇదిలా ఉండగా, శుక్రవారం తిరుపతిలో అమరావతి రైతులు తలపెట్టిన రాజధాని అమరావతి పరిరక్షణ మహోధ్యమ సభకు రాష్ట్ర ప్రజానీకం అంతా కదలిరావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. రాజధాని అమరావతికి మద్ధతుగా ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని అచ్చెన్న కోరారు. టీడీపీ శ్రేణులు కూడా ఈ సభను విజయవంతం చేయడంలో భాగం కావాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు.

''ప్రాంతీయ విధ్వేశాలు రెచ్చగొట్టే రాష్ట్ర ద్రోహులకు ఈ సభతో ప్రజలు గుణపాఠం చెప్పాలి. అమరావతిలో ఉన్న రూ.2లక్షల కోట్ల సంపదను ఈ ప్రభుత్వం బూడిదపాలు చేసింది. రాష్ట్ర భవిష్యత్ ను నాశనం చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే ప్రజలకు భవిష్యత్ ఉంటుంది. అభివృద్ధి చేయడం చేతకాక ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని పాలకపక్షం ప్రయత్నాలు చేస్తోంది'' అని మండిపడ్డారు. 

''రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని చెప్పిన మొదటి వ్యక్తి ys jaganmohan reddy. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టంలేక రాజధానిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని అసెంబ్లీలో చెప్పారు. రాజధాని మార్పు భూములు దోచుకున్నవారికే కావాలని... తమకు కాదని... రాజధానిగా అమరావతి ఉంటుందని ఎన్నికల ముందు ప్రచారం చేసి రాష్ట్ర ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. చెప్పిన మాటపై జగన్ నిలబడరని రాజధాని విషయంలోనే తేలిపోయింది. రోడ్లు వేయడానికి డబ్బులు లేవన్న వ్యక్తి three capitals ఎలా కడతారో ప్రజలకు సమాధానం చెప్పాలి.?'' అని అచ్చెన్న నిలదీసారు. 

34
Chandrababu Naidu reached to Tirupathi

Chandrababu Naidu reached to Tirupathi

''కొందరు మేధావుల ముసుగు వేసుకుని కొందరు వైసీపీ సానుభూతిపరులు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు. వైసీపీలో కూడా మూడు రాజధానులపై కొందరు మదనపడుతున్నారు. అన్ని పార్టీలు అమరావతిని ఏకైక రాజధానిగా కోరుతున్నాయి'' అన్నారు. 

''రాష్ట్రంలోని పరిశ్రమలను తరిమేసి నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టిన ఈ ప్రభుత్వాన్ని యువత నిలదీయాలి. రెండున్నరేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదు. చంద్రబాబు నాయుడు తెచ్చిన పరిశ్రమలు తప్ప కొత్తవి లేవు. వచ్చిన వాటిని కమీషన్ల కోసం తరిమేస్తున్నారు'' అని మండిపడ్డారు. 

''రాష్ట్ర ప్రజలు కోరుకునేది అభివృద్ధి వికేంద్రీకరణ తప్ప..అధికార వికేంద్రీకరణ కాదు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే రాష్ట్రాభివృద్ధికి అడుగులు పడతాయి. జగన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి వ్యవసాయాన్ని కుదేలు చేశారు. రెండున్నరేళ్లలో రాష్ట్రానికి వైసీపీ ఏం చేసిందో ప్రజలు నిలదీయాలి'' అని అచ్చెన్నాయుడు సూచించారు. 

44
Chandrababu Naidu reached to Tirupathi

Chandrababu Naidu reached to Tirupathi

అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగించాలని...మూడు రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్లుగా ఉద్యమిస్తున్న వీరు కొద్దిరోజులుగా న్యాయస్థానం నుండి దేవస్థానం పేరిట పాదయాత్ర చేపట్టారు. అమరావతి ప్రాంతంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర తిరుమలకు చేరుకుంది.  

పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో అమరావతి పరిరక్షణ మహోధ్యమ సభను ఏర్పాటు చేసారు. ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించినా హైకోర్టుకు వెళ్లి సభకు అనుమతి తెచ్చుకున్నారు. దీంతో శుక్రవారం సభ జరగనున్న నేపథ్యంలో విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు.  

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Recommended image1
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తీ కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌లు.. మ‌రో ప‌థ‌కానికి సిద్ధ‌మ‌వుతోన్న కూట‌మి ప్ర‌భుత్వం
Recommended image2
ఉద్యోగులు, విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్.. 2026 లో ఏకంగా 49 సెలవులు, పూర్తి హాలిడే లిస్ట్..!
Recommended image3
School Holidays : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు... ఇక స్కూళ్ళకు సెలవులేనా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved