Aryan Khan: ఎన్‌సీబీ విచారణకు హాజరుకాని అనన్య పాండే.. కారణమిదే..!

By telugu teamFirst Published Oct 25, 2021, 3:29 PM IST
Highlights

షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ నిందితుడిగా ఉన్న డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి అనన్య పాండే నేడు ఎన్‌సీబీ అధికారుల ముందు దర్యాప్తునకు హాజరుకావల్సి ఉంది. కానీ, తన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్ దృష్ట్యా విచారణకు హాజరుకాలేకపోతున్నారని, ఎన్‌సీబీ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి తనకు మరింత గడువు ఇవ్వాల్సిందిగా కోరారు. 
 

ముంబయి: బాలీవుడ్ సూపర్ స్టార్ Shah Rukh Khan తనయుడు Aryan Khan నిందితుడిగా ఉన్న Drugs కేసులో NCB విచారణకు మరో బాలీవుడ్ నటి Ananya Panday గైర్హాజరయ్యారు. విచారణకు హాజరుకాకపోవడానికి తన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్ కారణమని పేర్కొన్నారు. ఎన్‌సీబీ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి తనకు మరింత సమయం కావాలని, తన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్ కారణంగా విచారణకు హాజరుకాలేకపోతున్నట్టు వివరించారు.

ఆర్యన్ ఖాన్‌తో అనన్య పాండే రెండేళ్ల క్రితం చేసిన Whatsapp చాట్ లీక్ అయింది. ఈ వాట్సాప్ చాట్‌లో తనకు మాదక ద్రవ్యాలు కావాలని, అరేంజ్ చేస్తావా? అని ఆర్యన్ ఖాన్ అడగ్గా, అందుకు సరేనని అనన్య పాండే సమాధానమిచ్చారు. ఈ చాట్ ఆధారంగానే అనన్య పాండేను ఎన్‌సీబీ విచారణకు పిలిచింది. ఈ విచారణలో అనన్య పాండే తాను డ్రగ్స్ సమకూర్చలేదని స్పష్టం చేశారు. ఆ చాట్‌లో తాను కేవలం జోక్ చేస్తూ సరేనని పేర్కొన్నారని వివరించారు.

Also Read: ఆర్యన్ ఖాన్ కేసులో మరో ట్విస్ట్.. ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడేపై ఎన్‌సీబీ దర్యాప్తు

రెండు సార్లు ఆమెపై ప్రశ్నలు కురిపించారు. మొత్తం ఆరు గంటలు విచారించారు. అంతేకాదు, బాంద్రాలోని అనన్య పాండే ఇంటికీ ఎన్‌సీబీ బృందం వెళ్లి తనిఖీలు చేసింది. ఆమె ఎలక్ట్రానిక్ డివైజ్‌లను సీజ్ చేసింది. రెండు సార్లు అనన్య పాండేను పిలిచి విచారించినా ఆమె సమాధానాలు సంతృప్తికరంగా లేవని అధికారవర్గాలు తెలిపాయి. అందుకే మరోసారి ఆమెను దర్యాప్తునకు హాజరవ్వాలని సమన్లు పంపారు. సమన్ల ప్రకారం నేడు ఎన్‌సీబీ అధికారుల ముందు అనన్య పాండే హాజరుకావల్సి ఉన్నది. కానీ, స్కిప్ చేశారు.

అనన్య పాండేకు సమన్లు పంపి రెండు సార్లు విచారించినంత మాత్రానా ఆమె కేసులో అనుమానితురాలు కాదని, అలాగే నిందితురాలు అసలే కాదని ఎన్‌సీబీ వర్గాలు తెలిపాయి. దర్యాప్తులో భాగంగానే ఆమెను ప్రశ్నిస్తున్నట్టు వివరించాయి. వాట్సాప్ చాట్‌ల ఆధారంగానే ఆర్యన్ ఖాన్ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలు పెట్టుకున్నారని ఎన్‌సీబీ అధికారులు వాదిస్తున్నారు. ఈ వాదనతోనే ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వరాదని వాదించారు. ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణలో ఎన్‌సీబీ వైపు వాదనలు బలంగా వినిపించారు. దీంతో రెండుసార్లు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ లభించలేదు.

click me!