టీనేజ్ గర్ల్ గ్యాంగ్ రేప్ : 14 మంది అరెస్ట్, పోక్సో చట్టం కింద కేసు....

By AN TeluguFirst Published Sep 8, 2021, 10:40 AM IST
Highlights

పూణే రైల్వే స్టేషన్‌లో ఎదురుచూస్తున్న ఆ 14 ఏళ్ల అమ్మాయిని, ఓ ఆటోరిక్షా డ్రైవర్ గమనించాడు. ఆ ట్రైన్ మళ్లీ ఉదయమే వస్తుందని.. అప్పటివరకు తను ఆశ్రయం ఇస్తానని నమ్మబలికాడు. దీంతో అమాయకంగా అతన్ని నమ్మిన బాలిక అతనివెంట వెళ్లింది. 

పూణే : పుణెలో టీనేజ్ బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరో ఆరుగురిని అరెస్టు చేశారు. దీంతో నేరానికి సంబంధించి మొత్తం అరెస్టయిన వారి సంఖ్య 14 కి చేరుకుందని ఈరోజు ఓ అధికారి తెలిపారు.

ఆగస్ట్ 31న ఫ్రెండ్ ను కలవడానికి పూనే రైల్వే స్టేషన్ కు ఆ బాలిక వచ్చింది. ట్రైన్ ఎక్కడానికి చూడగా, ట్రైన్ వెళ్లిపోయింది. దీంతో పూణే రైల్వే స్టేషన్‌లో ఎదురుచూస్తున్న ఆ 14 ఏళ్ల అమ్మాయిని, ఓ ఆటోరిక్షా డ్రైవర్ గమనించాడు. ఆ ట్రైన్ మళ్లీ ఉదయమే వస్తుందని.. అప్పటివరకు తను ఆశ్రయం ఇస్తానని నమ్మబలికాడు. దీంతో అమాయకంగా అతన్ని నమ్మిన బాలిక అతనివెంట వెళ్లింది. 

ఆమెను ఆటోలో తీసుకెడుతున్న సమయంలోనే అతను తన స్నేహితులైన కొంతమంది ఆటో రిక్షా డ్రైవర్లు,ఇద్దరు క్లాస్ IV రైల్వే సిబ్బందిని ఎక్కించుకున్నాడు. వీరంతా ఆటోను నగరంలోని పలు చోట్ల తిప్పుతూ బాలిక మీద సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

13 యేళ్ల బాలిక కిడ్నాప్, సామూహిక అత్యాచారం.. ఆటో డ్రైవర్ ఘాతుకం.. !

కాగా ఈ కేసులో "టీనేజ్ అమ్మాయి పరిచయస్తుడితో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. సోమవారం, మరో ఎనిమిది మందిని అరెస్టు చేశాం. ఈ 14 మంది మీద ఐపీసీ, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేశాం.  తదుపరి విచారణ జరుగుతోంది "అని ఒక అధికారి చెప్పారు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఉదయం విడుదల చేసిన ఓ ప్రకటనలో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీసులను ఆదేశించామని తెలిపారు.

click me!