సీఎం నివాసానికి కూతవేటు దూరంలో... విద్యార్థినిపై 12మంది గ్యాంగ్ రేప్

By telugu teamFirst Published Nov 30, 2019, 10:28 AM IST
Highlights

ఇద్దరు వ్యక్తులు ఆమెను తుపాకులతో బెదిరించి కిడ్నాప్ చేయగా...ఆ ఇద్దరితో సహా.. మొత్తం 12మంది సదరు విద్యార్థిని పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రియాంక రెడ్డి హత్య కేసు దేశాన్ని కదిలించివేసింది. ఈ సంఘటన మరవకముందే అలాంటి సంఘటలు మరికొన్ని వెలుగు చూస్తున్నాయి. తాజాగా జార్ఖండ్ లో సాక్షాత్తు సీఎం అధికారిక నివాసినికి కూత వేటు దూరంలో ఓ న్యాయవిద్యార్థిపై సామూహిక అత్యాచారం జరిగింది.

ఇద్దరు వ్యక్తులు ఆమెను తుపాకులతో బెదిరించి కిడ్నాప్ చేయగా...ఆ ఇద్దరితో సహా.. మొత్తం 12మంది సదరు విద్యార్థిని పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మంగళవారం రాంచీలోని సంగ్రామ్‌పూర్‌ బస్టాండ్‌ సమీపంలో బాధితురాలు, ఆమె స్నేహితుడు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి వారిని గన్‌తో బెదిరించారు. యువతిని బలవంతంగా బైక్‌పై ఎక్కించుకొని వెళ్లారు. కొంత దూరం పోయాక బైక్‌లో పెట్రోలు అయిపోయింది. నిందితులు తమ స్నేహితులకు ఫోన్‌ చేసి కారును తీసుకురమ్మన్నారు.

Also Read: దారుణం.. ఇంటర్ చదివే కూతురిపై కన్న తండ్రి అఘాయిత్యం
 
అనంతరం వారంతా సమీపంలోని ఇటుక బట్టీల్లోకి తీసుకెళ్లి యువతిపై అత్యాచారం జరిపారు. తర్వాత మరికొంత మందిని పిలిచారు. ఇలా 12 మంది ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు అతి కష్టం మీద బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులందరినీ అరెస్టు చేశారు. 

మరోఘటనలో కోల్‌కతాలోని కాళీఘాట్‌ ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్న ఇద్దరు మైనర్‌ బాలికలను ముగ్గురు కిడ్నాప్‌ చేసి, 75 కిలోమీటర్ల దూరంలోని మాచండి ఆశ్రమం సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు ముగ్గురూ మైనర్లే కావడం గమనార్హం. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 

Also Read: పోలీసులు వెంటనే స్పందిస్తే ప్రియాంకను కాపాడుకునేవాళ్లం: జాతీయ మహిళా కమిషన్

మరోవైపు, యూపీలోని బల్లియా జిల్లాలో 15 ఏళ్ల దళిత బాలికను ఐదుగురు వ్యక్తులు నెల రోజుల పాటు కిడ్నాప్‌ చేసి పలుమార్లు అత్యాచారం జరిపారు. అక్టోబరు 16న కిడ్నాప్‌ చేసిన నిందితులు ఆమెను హరియాణాలోని పానిపట్‌కు తీసుకెళ్లారు. బాధితురాలు తప్పించుకొని నవంబరు 21న ఇంటికి వచ్చింది. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు.
 

click me!