కంటికి రెప్పలా బిడ్డను కాపాడాల్సిన తండ్రే ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. కన్నబిడ్డ అనే కనికరం కూడా లేకుండా ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బనగానపల్లెకు చెందిన వెంకటేశ్వరులుకి భార్య, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. కూతురు నంద్యాలలో ఇంటర్ సెంకడ్ ఇయర్ చదువుతోంది. హాస్టల్ లో ఉంటూ ఆమె అక్కడే చదువుకుంటోంది. కాగా... గురువారం వెంకటేశ్వర్లు కుమారుడికి కడుపులో నొప్పి వచ్చింది. దీంతో అపెండిక్స్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దీంతో అతనిని నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 

కాగా... తమ్ముడికి ఆరోగ్యం బాలేదంటూ వెంకటేశ్వర్లు హాస్టల్ లో ఉన్న కుమార్తెను ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అనంతరం అక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ... బాలికపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ, చెప్తే చంపేస్తానని అతను కూతురిని బెదిరించడం గమనార్హం.

కాగా... తండ్రి చేసిన అఘాయిత్యానికి సదరు బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడింది. కడుపులో నొప్పిగా ఉందంటూ తల్లికి తెలియజేసింది. ఏమీ తెలియని వాడిలా భార్యతో పాటు కూతురికి కడుపు నొప్పిగా ఉందని ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేపిస్తూ పక్కనే ఉంటూ కూతుర్ని భయబ్రాంతులకు గురి చేస్తూ నటించాడు..

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక బాధను భరించలేక జరిగిన దారుణ ఘటనను తల్లికి మొరపెట్టుకుంది తల్లి తన కుమార్తె పై జరిగిన దారుణాన్ని తన బంధువులకు తెలియజేసి పోలీసులకు సమాచారం అందించారు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేశ్వర్లుని అరెస్టు చేశారు.