బెంగళూరు గ్యాంగ్ రేప్ కేసు : 12 మంది అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు..

By AN TeluguFirst Published Jul 8, 2021, 4:01 PM IST
Highlights

ఓ మహిళపై బెంగళూరులో సామూహిక అత్యాచారం, హింసకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో బాధితురాలి ప్రైవేట్ భాగాలలో బాటిల్‌ను చొప్పించారు. తరువాత 22 ఏళ్ల ఆ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. 

బెంగళూరు : బంగ్లాదేశ్‌కు చెందిన మహిళపై దారుణమైన సామూహిక అత్యాచారం, హింస కేసుకు సంబంధించి 12 మందిని బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు, వారిలో పదకొండు మంది బంగ్లాదేశ్ పౌరులు ఉన్నారు.

ఐదు వారాల వ్యవధిలోనే ఈ కేసు దర్యాప్తు పూర్తయిందని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ గురువారం ట్వీట్ చేశారు. దీంతోపాటు కేసు చార్జిషీట్ కూడా కోర్టుకు సమర్పించామని పంత్ ట్వీట్ చేశారు.

ఈ కేసులో త్వరితగతిన పూర్తి చేసిన దర్యాప్తు బృందాన్ని ఆయన ప్రశంసించారు. వీరికి లక్ష రూపాయల రివార్డును కూడా ప్రకటించారు.  ఈ యేడాది మేలో ఈ దారుణం జరిగింది. 

ఓ మహిళపై బెంగళూరులో సామూహిక అత్యాచారం, హింసకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో బాధితురాలి ప్రైవేట్ భాగాలలో బాటిల్‌ను చొప్పించారు. తరువాత 22 ఏళ్ల ఆ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. 

బాధితురాలు బంగ్లాదేశ్ కు చెందిన యువతి. ఆమెను మూడేళ్ల క్రితం అక్కడినుంచి అక్రమంగా రవాణా చేసి అస్సాం, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, కర్ణాటకల్లో తిప్పుతూ ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు. 

డబ్బలు విషయంలో గొడవ రావడంతో ఆమెను దారుణంగా హింసించి, ఆ తరువాత సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారని ఆరోపించారు. "ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం, వీరంతా ఒకే గ్రూపుకు చెందినవారు. అందరూ బంగ్లాదేశ్ కు చెందినవారనని నమ్ముతున్నారు. 

డబ్బుల కారణంగానే బాధితురాలిమీద కిరాతకంగా దాడిచేశారని, ఆమెను బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాకు తరలించారని, అత్యాచారం, దాడి, ఇతర రకాలైన అభియోగాలు నిందితులపై మోపినట్టు బెంగళూరు పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దర్యాప్తు, అరెస్టుల సమయంలో తప్పించుకోవడానికి ప్రయత్నించిన ముగ్గురు నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో గాయపడ్డారు.  

click me!