అభినందన్‌ను విడుదల చేయాలంటూ పాక్‌లో ర్యాలీలు

By narsimha lodeFirst Published Mar 1, 2019, 5:21 PM IST
Highlights

భారత ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేయాలని భారత్‌తో పాటు పాక్‌లో కూడ నిరసనలు  కొనసాగాయి

ఇస్లామాబాద్: భారత ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేయాలని భారత్‌తో పాటు పాక్‌లో కూడ నిరసనలు  కొనసాగాయి.  పాక్‌లోని పౌరసంఘాల నేతలు అభినందన్‌ను విడుదల చేయాలని  డిమాండ్ చేశాయి.

భారత వింగ్ కమాండర్  అభినందన్ బుధవారం నాడు పాక్ ఆర్మీకి పట్టుబడ్డాడు.  రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చల్లబడేలా  చర్యలు తీసుకోవాలని పౌర హక్కుల నేతలు డిమాండ్ చేశారు. 

పాకిస్థాన్‌ మానవ హక్కుల సంఘం, ఆస్మా జహంగీర్‌ లీగల్‌ ఎయిడ్‌ సెల్‌, బాండెడ్‌ లేబర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌(బీఎల్‌ఎల్‌ఎఫ్‌), సౌత్‌ ఆసియా పార్టనర్‌షిప్‌ పాకిస్థాన్‌(ఎస్‌ఏపీ-పీకే), వుమెన్‌ యాక్షన్‌ ఫోరమ్‌(డబ్లూఏఎఫ్‌), అవామీ వర్కర్స్‌ పార్టీ తదితర సంస్థలు పాకిస్థాన్‌ వ్యాప్తంగా శాంతి ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాయి.

 లాహోర్‌, ఇస్లామాబాద్‌, పెషావర్‌, కరాచీ నగరాల్లో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యవాదులు పాల్గొన్నారు. అభినందన్‌ను విడుదల చేయాలని ర్యాలీలు నిర్వహించారు.  ఈ ర్యాలీలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పాకిస్థాన్‌లో అత్యధిక శాతం మంది ప్రజలు యుద్ధం కోరుకోవడం లేదని వుమెన్‌ ఇన్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఎంపర్‌మెంట్‌(డబ్ల్యూఐఎస్‌ఈ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బుష్రా ఖాలిక్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు

అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్

అభినందన్‌ను ప్రశ్నించనున్న 'రా' అధికారులు

వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు

అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్

అభినందన్: వాఘా వద్ద భారీ బందోబస్తు, రిట్రీట్ రద్దు

కొన్ని గంటల్లోనే భారత్‌కు అభినందన్‌: రాజ్‌నాధ్ సింగ్

లాహోర్‌కు చేరుకున్న అభినందన్, మరికొద్దిసేపట్లో వాఘాకు

వాఘా వద్ద అభినందన్‌ను రిసీవ్ చేసుకోనున్న ప్రత్యేక బృందం

అభినందన్‌కు అప్పగింతకు ముందు, ఆ తర్వాత ఇలా...

మొక్కవోని అభినందన్ ధైర్యం: పేపర్లు నమిలి మింగేశాడు

వాఘాకు చేరుకొన్న అభినందన్ తల్లిదండ్రులు: కొడుకు కోసం ఎదురు చూపులు

మసూద్‌ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్


 

click me!