మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

By narsimha lodeFirst Published Oct 24, 2018, 11:32 AM IST
Highlights

అవినీతి ఆరోపణల నేపథ్యంలో  సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ,  సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలు సెలవుపై వెళ్లారు.


న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణల నేపథ్యంలో  సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ,  సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాలు సెలవుపై వెళ్లారు.  సీబీఐలో చోటు చేసుకొన్న పరిణామాలపై  నాగేశ్వరరావు విచారణ జరుపుతున్నారు.సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావు నియమితులయ్యారు.

సీబీఐ ఉన్నతాధికారుల మధ్య చోటు చేసుకొన్న ప్రచ్ఛన్నయుద్దం నేపథ్యంలో  విపక్ష పార్టీలు  బీజేపీని, ప్రధానమంత్రి మోడీని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు గుప్పించాయి. సోషల్ మీడియా వేదికగా విపక్షాలు బీజేపీ తీరును ఎండగట్టాయి. 

విపక్షాలు,  సామాజికవేత్తలు  తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు.  ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో  సీబీఐ డైరెక్టర్  అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్‌ఆస్థానాలను  లీవ్‌పై వెళ్లాల్సిందిగా ప్రధానమంత్రి మోడీ ఆదేశించారు. 

దీంతో వీరిద్దరూ సెలవుపై వెళ్లారు.బీజేపీ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు అభిషేక్ సింఘ్వి,  రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలాలు వరుస ట్వీట్లతో మోడీ సర్కార్‌ను దుమ్మెత్తి పోశారు.

గుజరాత్ మోడల్ ను  మోడీ సీబీఐలో కూడ ప్రవేశపెట్టారనే  విమర్శలు  చేశారు.  సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి  సీతారాం ఏచూరి,  ప్రముఖ జర్నలిస్ట్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరీలు కూడ మోడీ తీరును ఎండగట్టారు.

సంబంధిత వార్తలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా

దేశచరిత్రలోనే తొలిసారిగా.. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో సోదాలు

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా తెలుగు ఐపీఎస్

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ కు ఊరట:అరెస్ట్ చేయెుద్దన్న ఢిల్లీ హైకోర్టు

సతీష్ సానా ఇష్యూ: సిఎం రమేష్ ఇరుక్కున్నారా, టీడీపికి చిక్కులే...

జగన్ కేసు: అప్పటి నుండే సీబీఐ దర్యాప్తులో సతీష్ సానా పేరు

సీబీఐలో అంతర్యుద్దం: ఎవరీ సతీష్‌బాబు

click me!