ఈగల్లోనూ స్వలింగ సంపర్కం.. ప్రకృతి వైపరిత్యమే..!

By telugu news teamFirst Published Mar 20, 2023, 11:08 AM IST
Highlights

నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. నిపుణుల పరిశోధనలో ఈ విషయం తేలింది. ఆడ ఈగల పట్ల మగ ఈగలు ఆకర్షణకు గురవ్వడం లేదట. అవి కూడా స్వలింగ సంపర్కానికి అలవాటు పడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

మనుషుల దగ్గర నుంచి జంతువుల వరకు... ఆడ వారి పట్ల మగవారు, మగవారి పట్ల ఆడవారు ఆకర్షణకు గురౌతూ ఉంటారు. ఇది సర్వ సాధారణం. అయితే.... ఈ మధ్య చాలా మందిలో హార్మోన్ల లోపం కారణంగా.. లేదా ఇంకేదైనా కారణం చేత... స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డారు. దీనిని చాలా దేశాలు కూడా చట్టం చేశాయి. దీంతో... ఎవరు ఎవరినైనా ఇష్టపడొచ్చు, సంభోగంలో పాల్గొనవచ్చు. అయితే... ఇదే అలవాటు.. ఈగల్లోనూ కనిపిస్తోందట. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. నిపుణుల పరిశోధనలో ఈ విషయం తేలింది. ఆడ ఈగల పట్ల మగ ఈగలు ఆకర్షణకు గురవ్వడం లేదట. అవి కూడా స్వలింగ సంపర్కానికి అలవాటు పడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి మానవ తప్పిదాలే కారణమని తేల్చడం గమనార్హం.


మనుషులు సృష్టిస్తున్న కాలుష్యం కారణంగా  ఈగల్లో ఇలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయని వారు చెప్పడం గమనార్హం. కాలుష్యం కారణంగా ఓజోన్ లో మార్పులు రావడంతో పాటు... ఈగల ప్రవర్తనలోనూ మార్పులు వస్తున్నట్లు వారు గుర్తించారు.ఈ కాలుష్యం కారణంగా ఈగల్లో ఫెరోమోన్స్ అనే హార్మోన్లు విడుదల కావడం లేదట. దీంతో ఈగలు ఆడ, మగ తేడాలను గుర్తించడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలోనే అవి స్వలింగ సంపర్కానికి అలవాటు పడుతున్నాయట. ఓజోన్ స్థాయి 100 పీపీబీగా ఉండటంతో ఈగల్లో ఉండే ఫెరోమోన్స్ హార్మోన్ప్రభావం వేగంగా తగ్గిపోతున్నదని గుర్తించారు. ఈ హార్మోన్ లేకపోవడం వల్ల వాటి శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ పరిశోధన ప్రకారం 10 మగ ఈగల్లో కేవలం 7 ఈగలు మాత్రమే ఆడ ఈగలతో జతకడుతున్నాయని, మిగిలిన మూడు మగ ఈగలు మరో మగ ఈగలతో స్వలింగ సంపర్కానికి అలవాటు పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

click me!