రంజాన్ లో ఆరోగ్యంగా ఉండటానికి మీకోసం కొన్ని టిప్స్

By Mahesh RajamoniFirst Published Mar 28, 2023, 4:09 PM IST
Highlights

Ramadan 2023: రంజాన్ ఉపవాసం ఉండేవారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా సేపు ఉపవాసం ఉండటం వల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. 

Ramadan 2023: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రంజాన్ మాసంలో చాలా మంది ఉపవాసం ఉంటారు. అయితే ఈ ఉపవాసం వల్ల అల్లా దయ పొందినప్పటికీ.. మీ శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఆహారం, ఫుడ్ లేకుండా ఎక్కువ సేపు ఉండటం వల్ల అలసట, ఒత్తిడి వంటి సమస్యలు సమస్యలు వస్తాయి. రంజాన్ ఉపవాసంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

సెహ్రీని మిస్ అవ్వకండి

సెహ్రీని సుహూర్ అని కూడా పిలుస్తారు. దీనిని రోజులో అత్యంత ముఖ్యమైన ఆహారంగా భావిస్తారు. సెహ్రీ అనేది ఇఫ్తార్ విందు వరకు శరీర అవసరాలను తీర్చడానికి పోషకాలను అందిస్తుంది.  పోషకాలను నిల్వ చేయడానికి దోహదం చేసే ప్రీ-మార్నింగ్ భోజనం ఇది. అయితే చాలా మంది సెహ్రీని స్కిప్ చేస్తుంటారు. ఎందుకంటే చాలా మంది ఉదయం అంత తొందరగా నిద్రలేవరు. అయితే సెహ్రీని స్కిప్ చేయడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే దీనివల్ల మీరు రోజంతా అలసిపోయినట్టుగా ఉంటారు. జీర్ణక్రియ మెరుగ్గా ఉండాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. అంటే అత్తి పండ్లు, అరటిపండ్లు, ఖర్జూరాలు, తృణధాన్యాలు, ధాన్యాలు, గోధుమలు, వోట్స్, జున్ను, గుడ్లు, మాంసం వంటి పోషకాలున్న ఆహారాలను తినాలి. 

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచండి

పవిత్ర మాసంలో గుర్తుంచుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయాలలో ఇదీ ఒకటి. రోజుకు 8 గ్లాసులు లేదా 2 లీటర్ల నీటిని తాగాలి. అప్పుడే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. మీ శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గితే బాడీ నిర్జలీకరణం బారిన పడుతుంది. దీనివల్ల మలబద్ధకం, తలనొప్పి, బద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఉపవాసం ప్రారంభించడానికి ముందు రెండు-మూడు గ్లాసుల నీటిని తాగండి. ఇఫ్తార్, నిద్రపోవడానికి ముందు నీటిని ఖచ్చితంగా తాగాలి. కాఫీ, టీ, ఏరేటెడ్ పానీయాలతో సహా కెఫిన్ కలిగున్న అనారోగ్య పానీయాలకు దూరంగా ఉండండి. కాఫీని తాగకుండా ఉండలేని వారు ఇఫ్తార్ వింధు తర్వాత ఒకటి లేదా రెండు గంటల తర్వాత ఒక కప్పు కాఫీని తాగొచ్చు. పండ్లు, కూరగాయలు, సూప్లు వంటి నీరు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. 

భోజనంపై నిఘా ఉంచండి

ఇఫ్తార్ విందులో ఏవి పడితే అవి తినకూడదు. అంతేకాదు మోతాదుకు మించి తింటుంటారు. కానీ భోజనాన్ని తినకూడదు. అతిగా తినడం వల్ల టైప్ -2 డయాబెటిస్ తో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి. అందుకే తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం మంచిది.

వ్యాయామాలకు దూరంగా ఉండాలి

నెల మొత్తం ఎక్కువ గంటలు ఉపవాసం ఉంటారు. దీనివల్ల మీ శరీరం నిర్జలీకరణానికి గురవుతుంది. అందుకే ఈ సమయంలో వ్యాయామాలు చేయకపోవడమే మంచిది. ఒకవేళ వ్యాయామం చేసినా.. కఠిణమైన వ్యాయామాలను చేయకూడదు. ఉపవాస సమయాల తర్వాత తేలికపాటి వ్యాయామాల వల్ల ఎలాంటి సమస్యా రాదు. ఎందుకంటే అవి శరీర పనితీరును నియంత్రించడానికి,  హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడతాయి.

ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవద్దు

రంజాన్ సమయంలో ఉపవాసాన్ని విరమించిన తర్వాత వేయించిన, ఆయిలీ ఫుడ్ ను,  ప్రాసెస్ చేసిన ఆహారాలను అసలే తినకూడదు. ఎందుకంటే వీటిలో పోషకాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఎక్కువ కొవ్వును కలిగి ఉంటాయి. ఇలాంటి ఆహారాలను తినడం వల్ల అప్పటికప్పుడే కడుపులో గ్యాస్, వికారం, గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. సూప్లు, తాజా పండ్లు, కూరగాయలు, కాల్చిన మాంసం, బ్రైస్డ్ వంటకాలు వంటి తక్కువ నూనెతో వండిన ఆహారాన్ని తీసుకోండి. 

click me!