పూలతో మాస్క్... వధూవరులకు స్పెషల్..!

By telugu news teamFirst Published Aug 11, 2021, 2:18 PM IST
Highlights

మధురైకి  చెందిన ఈ పూల వ్యాపారి.. పూలతో మాస్క్ లు తయారు చేయడం గమనార్హం. వధూవరుల కోసం స్పెషల్ వాటిని డిజైన్ చేశాడు. అవి చాలా అందంగా ఉండటం విశేషం.
 


ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందే. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలంటే మాస్క్  పెట్టుకోవాల్సిందే. ప్రస్తుతం అందరూ దీనిని ఫాలో అవుతున్నారు. తప్పనిసరి కావడంతో..,  ఈ మాస్క్ ల్లో కొత్త కొత్త డిజైన్లు, రకరకాలు మార్కెట్లోకి వస్తున్నాయి. పెళ్లిలో అయితే.. వధూ వరులు స్పెషల్ గా డిజైన్ చేయించిన మాస్క్ లను ధరిస్తున్నారు. అమ్మాయిలు సైతం తాము ధరించే డ్రెస్ కి మ్యాచింగ్  మాస్క్ లు కొనుక్కుంటున్నారు.

మాస్క్ ఆరోగ్య రక్షణ కోసం అయినప్పటికీ.. ఇదో ట్రెండ్ గా మారింది. కాగా.. తాజాగా ఓ పూల వ్యాపారి.. వధూవరుల కోసం ప్రత్యేకంగా మాస్క్ లు తయారు చేశాడు.  మధురైకి  చెందిన ఈ పూల వ్యాపారి.. పూలతో మాస్క్ లు తయారు చేయడం గమనార్హం. వధూవరుల కోసం స్పెషల్ వాటిని డిజైన్ చేశాడు. అవి చాలా అందంగా ఉండటం విశేషం.

Tamil Nadu | Mohan, a flower vendor in Madurai makes floral masks exclusively for brides, grooms to raise awareness about COVID-19

"Despite govt orders, people don't wear masks at weddings. I make these floral masks to encourage brides, grooms to wear them," he said (10.08) pic.twitter.com/1gJKK3S68p

— ANI (@ANI)

ఈ మాస్క్ లు స్టైలిష్ గా ఉండటంతోపాటు.. కరోనా పై అందరికీ అవగాహన కలిగేలా ఉండాలని తాను ఇలా తయారు చేశానని సదరు పూల వ్యాపారి మోహన్ చెప్పడం గమనార్హం. వధూవరుల దుస్తులకు మ్యాచ్ అయ్యేలా తాను ఈ పూల మాస్క్ లు తయారు చేశానని  అతను చెప్పాడు.

 

click me!