అమ్మాయిలు.. తమకంటే చిన్నవారిని పెళ్లిచేసుకోవడానికి కారణం ..?

By ramya neerukondaFirst Published 5, Sep 2018, 3:48 PM IST
Highlights

తమకంటే చిన్నవారిని మహిళలు వివాహమాడటం వలన వారిలో దాగున్న చిలిపితనం బయటికి వస్తుంది. ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఇద్దరి మధ్య రొమాన్స్ కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రేమ మరింత పెరుగుతుంది. ఇద్దరూ సన్నిహితంగా ఉంటారు.
 

ఒకప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలకు దాదాపు పదేళ్లు తేడా ఉండేది. అమ్మాయిలకంటే.. అబ్బాయిలే వయసులో పెద్దగా ఉండేవారు. తర్వాత తర్వాత కాలం మారింది.. వయసులో తేడాలో మార్పు వచ్చింది. ఒకటి రెండు సంవత్సరాలు గ్యాప్ తో పెళ్లిళ్లు చేసుకునేవారు. ఇప్పుడు టోటల్ రివర్స్ గా మారింది. అబ్బాయిలకంటే.. అమ్మాయిల వయసులో పెద్దవారిగా ఉంటున్నారు. అలా తమకన్నా చిన్నవారిని మహిళలు పెళ్లిచేసుకోవడానికి కారణం ఉందంటున్నారు నిపుణులు.

మహిళలు తమ కంటే వయసులో చిన్నవారిని పెళ్లాడడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం అవుతుంది. వివాహమాడటానికి తమ వయసు వారిలో ఛాయిస్ లేకపోవడంతో తమ కంటే తక్కువ వయసున్న వారిపై మొగ్గు చూపుతున్నారు కొందరు మహిళలు. ఈ కారణం వలన తమకంటే తక్కువ వయసున్న పురుషులను పెళ్లాడటానికి మహిళలు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది.

వివాహబంధం తమ అదుపులో ఉండటానికి మహిళలు ప్రాధాన్యతనిచ్చినప్పుడు తమకంటే చిన్నవారిని పెళ్లాడాలని వారు భావిస్తారు. వివాహబంధంపై కంట్రోల్ ని తీసుకోవడానికి వారు ఇష్టపడతారు. ప్రతి రోజుని ఆస్వాదించాలని కోరుకుంటారు. తమకంటే చిన్నవారిని పెళ్లి చేసుకోవడం వలన జీవితంపై మహిళలు తమ భర్త కంటే ఎక్కువగా అవగాహన కలిగి ఉంటారు.

 ప్రతి వివాహబంధంలో తలెత్తే సమస్యలను చాకచక్యంగా పరిష్కరించగలుగుతారు. తమ వివాహబంధం పదిలంగా ముందుకు సాగేందుకు వయసులో పెద్దదైన తమ భార్య తీసుకునే నిర్ణయాలను సాదరంగా స్వాగతించేందుకు పురుషులు ఏ మాత్రం వెనకడుగు వేయరు. అందువలన, వీరిద్దరి మధ్య అవగాహన మరింత పెరుగుతుంది. వివాహబంధం పదిలంగా ముందుకు సాగుతుంది.

తమకంటే చిన్నవారైనా పురుషుడిని వివాహమాడిన స్త్రీ తన వయసుకంటే తక్కువ వయసున్నట్టుగా భావనకు లోనవుతుంది. తనలోని యవ్వనం మళ్ళీ యాక్టివ్ గా మారినట్టు భావిస్తుంది. యవ్వనంలో పురుషులు యాక్టివ్ గా అలాగే స్పోర్టివ్ గా ఉంటారు. అదే విధమైన అనుభూతికి స్త్రీలు లోనవుతారు. తమకంటే చిన్నవారిని మహిళలు వివాహమాడటం వలన వారిలో దాగున్న చిలిపితనం బయటికి వస్తుంది. ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఇద్దరి మధ్య రొమాన్స్ కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రేమ మరింత పెరుగుతుంది. ఇద్దరూ సన్నిహితంగా ఉంటారు.

Last Updated 9, Sep 2018, 11:22 AM IST