ట్రంప్ భారత పర్యటన: కథ మొత్తం చికెన్ లెగ్ పీసుల చుట్టూనే..!!

By Siva KodatiFirst Published Feb 14, 2020, 2:45 PM IST
Highlights

టైటిల్ చూసి ఇది చికెన్ ముక్కల కోసం అనుకోకండి. మ్యాటర్ చికెన్ గురించే కానీ దీని వెనుక అసలు విషయం వేరే ఉంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24, 25 తేదీల్లో భారత్‌కు రానున్న సంగతి తెలిసిందే. 

టైటిల్ చూసి ఇది చికెన్ ముక్కల కోసం అనుకోకండి. మ్యాటర్ చికెన్ గురించే కానీ దీని వెనుక అసలు విషయం వేరే ఉంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24, 25 తేదీల్లో భారత్‌కు రానున్న సంగతి తెలిసిందే.

ఈ పర్యటన ప్రధానంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు ఇతర ఒప్పందాల కోసమేనని రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. ట్రంప్ అమెరికా వైపు నుంచి కొన్ని ప్రతిపాదనలు ముందుకు తెచ్చినట్లుగా తెలుస్తోంది.

Also Read:త్వరలో భారత్ పర్యటన.. మోదీకి ట్రంప్ భార్య ధన్యవాదాలు

వీటిలో ప్రధానంగా మాంసం, పాల ఉత్పత్తులను భారత మార్కెట్లలోకి అనుమతించాలని ప్రధాని మోడీని కోరనున్నారని సమాచారం. ప్రపంచంలోనే పాల ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న భారతదేశంలో ప్రస్తుతం దిగుమతులపై పరిమితులు ఉన్నాయి. దేశంలోని సుమారు 8 కోట్ల కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి ఉన్నాయి. వీరిని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం దిగుమతులపై ఆంక్షలు విధించింది.

అయితే అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్న భారత్.. ట్రంప్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రాధాన్య వాణిజ్య హోదా ఉన్న దేశాల జాబితా నుంచి భారత్‌ను 2019లో ట్రంప్ తొలగించారు.

అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య విభేదాలు నెలకొన్నాయి. వీటికి స్వస్తి పలికి ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2018లో భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య విలువ 142.6 బిలియన్ డాలర్లు.

Also Read:ఫిబ్రవరిలో భారత్‌కు ట్రంప్: పలు కీలక ఒప్పందాలు

ట్రంప్ ప్రతిపాదన మేరకు చికెన్ లెగ్‌ పీస్‌లపై ఉన్న 100 శాతం సుంకాలను 25 శాతానికి తగ్గించేందకు భారత ప్రభుత్వం సిద్ధమైనట్లుగా సమాచారం. అయితే ఇది 10 శాతానికి పరిమతం చేయాలని అమెరికా పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే టర్కీ కోళ్లు, బ్లూ బెర్రీలను దిగుమతి చేసుకునేందుకు సైతం భారత్ అంగీకరించినట్లుగా సమాచారం.

పాల ఉత్పత్తులను సైతం ఐదు శాతం సుంకాలతో అనుమతించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. వీటితో పాటు ప్రఖ్యాత ద్విచక్ర వాహన తయారీ సంస్థ హార్లీ డేవిడ్‌సన్ తయారు చేసిన బైక్‌లపై విధించిన 50 శాతం టారీఫ్‌లను కూడా తగ్గించేందుకు భారత్ సిద్ధమైనట్లుగా పారిశ్రామిక వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

click me!