ఓ చిన్నపొరపాటు.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ఓ యువకుడిని గుడ్డి వాడిని చేసింి. గత ఏడేళ్లుగా కాంటాక్ట్ లెన్స్ వాడుతున్న మైక్ కాంటాక్ట్ లెన్స్ ధరించడం వల్ల ఆయన ఏకంగా కంటినే కోల్పోయాడు.
కాంటాక్ట్ లెన్స్‌ల ప్రమాదం: కొన్ని విషయాలు తెలిసినప్పటికీ.. చాలా సార్లు మనం తప్పులు చేస్తుంటాం. అదృష్టం బాగుంటే.. ఎలాంటి హాని జరగదు. కానీ దురదృష్టం తమ వెంటుంటే.. ఒక్క చిన్న పొరపాటుకు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని తీరని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఇలానేఅమెరికాను చెందిన ఓ యువకుడి జీవితంలో జరిగింది. మైక్ క్రుమ్‌హోల్జ్ అనే వ్యక్తి మరిచిపోయి.. కాంటాక్ట్స్ వేసుకుని నిద్రపోయాడు. ఈ చిన్న పొరపాటు అతని జీవితాన్ని అంధకారంలోకి నెట్టివేసింది. కాంటాక్ట్ లెన్స్ పెట్టు నిద్రపోవడం వల్ల అరుదైన పరాన్నజీవి అతని కంటి మాంసాన్ని తినేసింది. ఫలితంగా అతను కంటి చూపును కోల్పోయాడు.
వివరాల్లోకెళ్లే.. యునైటెడ్ స్టేట్స్‌లోని ఫ్లోరిడాకు చెందిన ఇరవై ఒక్క ఏళ్ల మైక్ క్రుమ్‌హోల్జ్ పార్ట్ చదువుకుంటూ..టైమ్ జాబ్ చేస్తూ జీవిస్తున్నాడు. అతడు ఎప్పటిలాగానే జాబ్ నుంచి ఇంటికి రాగానే కాసేపు రెస్ట్ తీసుకుందామని పడుకున్నారు. కానీ.. కాసేపటికి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఇక్కడ మైక్ క్రుమ్‌హోల్జ్ చేసిన ఏకైక తప్పు ఏమిటంటే.. అతను ఎప్పటిలాగా.. కాంటాక్ట్ లెన్స్‌లు తీయకుండా నిద్రపోయాడు. దాదాపు 40 నిమిషాల పాటు లెన్స్ వేసుకుని నిద్రపోయాడు. నిద్ర లేచి చూసే సరికి అతని కంటికి తీవ్ర ఇన్ఫెక్షన్ సోకింది.
మైక్ గత 7 సంవత్సరాలుగా అద్దాలు ధరించనప్పుడు కాంటాక్ట్ లెన్స్‌లు ధరించేవాడు. కంటికి ఇన్ఫెక్షన్లు వస్తాయని కాంటాక్ట్ లెన్సులు వేసుకుని నిద్రపోకూడదని ఆయనకు బాగా తెలుసు.. అయితే ఈ సారి మాత్రం.. అతని కన్ను బాగా ఎర్రబడింది. నొప్పి కూడా ఎక్కువైంది. వెంటనే వెద్యుడిని సంప్రదించాడు. కానీ.. ఆయన ఏకంగా కంటినే కోల్పోయాడు. అతని కుడి కంటిలో అకాంతమీబా కెరాటిటిస్ ఉన్నట్లు నిర్థారించారు వైద్యులు. ఫిబ్రవరి 7న తనకు జరిగిన ఘటనను వివరించాడు.
తనకు వచ్చిన పరిస్థితి చాలా బాధాకరంగా ఉందనీ, తన కుడి కంటి చూపు పూర్తిగా పోయిందని వాపోయారు. ఇకపై తాను ఏం పనిని సరిగా చేయలేననీ, తాను బయటికి వెళ్లలేననీ, తాను క్లిష్ట సమయాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నానని క్రుమ్‌హోల్జ్ చెప్పినట్లుగా GoFundMe పేజీ పేర్కొంది. అతను చివరగా కాంటాక్ట్ లెన్స్‌లు ధరించి నిద్రపోవద్దని లేదా స్నానం చేయవద్దని విజ్ఞప్తి చేశాడు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం..ఈ రకమైన పరాన్నజీవి సంక్రమణం 10 లక్షల మందిలో 33 మంది కాంటాక్ట్ లెన్స్ ధరించినవారిలో కనుగొనబడిందని తెలిపారు.