SBI Jobs
Bank Jobs : తెలుగు యువతకు గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఇండియా ((State Bank Of India)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. హైదరాబాద్ లో పనిచేసేందుకు ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ చేపట్టంది ఎస్బిఐ (SBI). ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ (మిడిల్ మేనేజ్ మెంట్ గ్రేడ్ - స్కేల్ 2) ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది స్టేట్ బ్యాంక్. బ్యాంక్ జాబ్స్ పై ఆసక్తివుండి, నోటిఫికేషన్ లో పేర్కొన్న అర్హతలుంటే మీరు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది ఎస్బిఐ. రిజర్వేషన్ల వారిగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. మొత్తం 150 ఉద్యోగాల్లో ఎస్సీలకు 24, ఎస్టిలకు 11, ఓబిసిలకు 38, ఈడబ్ల్యూఎస్ కు 15 కేటాయించారు...మిగతా 62 అన్ రిజర్వుడ్. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
విద్యార్హతలు :
ప్రభుత్వ గుర్తింపుపొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుండి గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పూర్తిచేసివుండాలి. IIBF ద్వారా ఫారెక్స్‌లో సర్టిఫికేట్ పొందివుండాలి.
సర్టిఫికెట్ ఫర్ డాక్యుమెంటరీ క్రెడిట్ స్పెషలిస్ట్ (CDCS), ట్రేడ్ ఫైనాన్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి కోర్సులు చేసినవారికి ప్రాధాన్యత వుంటుంది.
అనుభవం :
ఇదివరకే ఏదయినా కమర్షియల్ బ్యాంక్ లో ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్ లో రెండేళ్లకు పైగా పనిచేసిన అనుభవం వుండాలి.
మంచి కమ్యూనికేషన్, ప్రొఫెషనల్, ప్రాసెసింగ్ స్కిల్స్ వున్నవారికి ఈ ఉద్యోగాలు పొందేందుకు ఎక్కువ అవకాశం వుంటుంది.
వయో పరిమితి :
అభ్యర్థులకు 23 ఏళ్ల నుండి 32 ఏళ్లలోపు వయసు వుండాలి. (31-12-2024 నాటికి)
రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్ధులకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వయో పరిమితి సడలింపు వుంటుంది.
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబిసి అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.750
ఎస్సి,ఎస్టి, పిడబ్ల్యూబిడి అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు...వారు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు.
లేటెస్ట్ ఫోటోతో పాటు సంతకంను స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి. లేదంటే ఆన్ లైన్ అప్లికేషన్ రిజిస్టర్ చేయలేం.
ఇక అభ్యర్థులు జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ లో వివరాలను పొందుపర్చాలి. ఫామ్ ఫిల్ చేసాక మరోసారి వ్యక్తిగత, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ వివరాలను సరిచూసకోవాలి.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అభ్యర్థులు సిస్టమ్ జనరేటెడ్ ఆన్ లైన్ అప్లికేషన్ ఫామ్ ప్రింటవుట్ తీసుకోవాలి.
అప్లికేషన్ సమయంలో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ ఇవ్వాలి. రిక్రూట్ మెంట్ ప్రాసెక్ కు సంబంధించిన వివరాలను వీటిద్వారానే అందించబడతాయి.
దరఖాస్తు కోసం ఈ లింక్ https://recruitment.bank.sbi/crpd-sco-2024-25-26/apply క్లిక్ చేయండి.
దరఖాస్తుకు చివరి తేదీ :
ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది (జనవరి 3,2025 లో ప్రారంభమైంది)
జనవరి 23, 2025 తో దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత దరఖాస్తుల స్వీకరణ నిలిచిపోతుంది.
ఎంపిక ప్రక్రియ :
ఎలాంటి రాతపరీక్షలేకుండానే ఎంపిక చేపడుతున్నారు. అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక వుంటుంది. 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు... అర్హత మార్కులను బ్యాంక్ నిర్ణయిస్తుంది. ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల సెలక్షన్ వుంటుంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబర్చినవారికి ఈ ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా వుంటాయి.
సాలరీ :
నెలకు 64,000 నుండి 93,000 వేల వరకు వుంటుంది. అలాగే డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, పిఎఫ్, కంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్ వంటి ఇతర సదుపాయాలు కూడా వుంటాయి.