రామ్‌ చరణ్‌కి అన్యాయం చేసిన శంకర్‌, `గేమ్‌ ఛేంజర్‌` విషయంలో ఆయన చేసిన మిస్టేక్‌ ఇదే?

First Published | Jan 11, 2025, 8:21 AM IST

`గేమ్‌ ఛేంజర్‌` మూవీలో రామ్‌ చరణ్‌ పాత్రకి దర్శకుడు శంకర్ అన్యాయం చేశాడా? ఆయన్ని కావాలని తక్కువ చూపించాడా? ఈ మూవీ విషయంలో దర్శకుడు చేసి మిస్టేక్‌ ఏంటి?
 

Shankar

రామ్‌ చరణ్‌ నటించిన `గేమ్‌ ఛేంజర్‌` మూవీ నేడు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. యాంగర్‌ మేనేజ్‌మెంట్‌, మదర్‌ సెంటిమెంట్‌, ప్రభుత్వంలో మార్పుల నేపథ్యంలో తెరకెక్కించారు.

శంకర్‌ మార్క్ సామాజిక సందేశాన్ని జోడించిన చిత్రమిది. నేడు శుక్రవారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తుంది.  ఫ్యాన్స్ ఎంజాయ్‌ చేస్తున్నారు. కామన్‌ ఆడియెన్స్ ఫర్వాలేదంటున్నారు. యాంటీ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. 

ఈ నేపథ్యంలో నెగటివ్స్ ఏంటి? దర్శకుడు శంకర్‌ ఏం మిస్టేక్‌ చేశారు. పాజిటివ్‌ అంశాలేంటి? హైలైట్స్ ఏంటనేది చూస్తే. సినిమా విజువల్‌ గ్రాండియర్‌ గా తెరకెక్కడం విశేషం. దర్శకుడు శంకర్‌ భారీ టెక్నీకల్‌ వ్యాల్యూస్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. తన మార్క్ భారీతనం కనిపిస్తుంది.

కమర్షియల్‌ ఎలిమెంట్లు ఉన్నాయి. పాటల్లోనూ సందేశాన్ని చెప్పడం ఆయనకే సాధ్యమైంది. ముఖ్యంగా `దోప్‌` సాంగ్‌లో యాంగర్‌ మేనేజ్‌మెంట్ గురించి చెప్పారు. అదే సమయంలో రాజకీయ వ్యవస్థలో మార్పులను, రాజకీయాల కంటే అడ్మినిస్ట్రేషన్‌ ఎంత గొప్పదో చెప్పే ప్రయత్నం చేశారు. 


యాక్షన్‌ సీన్లు బాగున్నాయి. సరికొత్త యాక్షన్‌తో మెప్పించారు. ట్విస్ట్ లు కూడా అదిరిపోయారు. విలన్‌ ఎస్‌ జే సూర్య పాత్ర ఎత్తులకు, రామ్‌ చరణ్‌ తిప్పికొట్టడం, వాటిని అంతే తెలివిగా ఎదుర్కోవడం ఇందులో హైలైట్స్. ఫస్టాఫ్‌లో ఎంట్రీ సీన్లు, మధ్యలో చిన్న కామెడీ సీన్లు, క్లైమాక్స్ కి ముందు వచ్చే సీన్‌, ట్విస్ట్ లు అదిరిపోయాయి. ఎస్‌ జే సూర్యతో సవాల్‌ చేసే సీన్లు మెప్పించాయి. ఇక సెకండాఫ్‌లో అప్పన్న ఎపిసోడ్ హైలైట్‌ అవుతుంది. శ్రీకాంత్‌ పాత్ర ఇచ్చిన ట్విస్ట్ మరో హైలైట్‌. 

read more: దంగల్ రికార్డ్స్ పై కన్నేసిన పుష్ప2, అల్లుఅర్జున్ ప్లాన్ మామూలుగా లేదుగా.
 

అయితే ఇందులో రామ్‌ చరణ్‌ పాత్ర కంటే ఎస్‌జే సూర్య పాత్రనే హైలైట్‌ అవుతుంది. ఆ పాత్రకే ఎక్కువ స్కోప్‌ ఉంది. ఇదే ఇక్కడ చరణ్‌ ఫ్యాన్స్ ని అసంతృప్తికి గురి చేస్తుంది. చాలా చోట్ల ఎస్‌ జే సూర్య రెచ్చిపోతుంటే రామ్‌ చరణ్‌ పాత్ర సైలెంట్‌గా ఉండిపోతుంది. ఆ రేంజ్‌లో చరణ్‌ని చూపించలేకపోవడం పెద్ద మైనస్‌.

ఫ్యాన్స్‌ అంతా చరణ్‌నిచూడాలని వస్తారు, ఎస్ జేసూర్య కోసం కాదు. శంకర్‌ ఆ లాజిక్‌ మిస్‌ అయ్యాడు. ఎస్‌ జే సూర్య అద్బుతమైన నటుడు, ఆయన ఛాన్స్ ఇచ్చి రెచ్చిపోతాడు, కానీ ఇందులో హీరో, విలన్‌ రెండు పాత్రలకు అదే ప్రయారిటీ ఇవ్వాలి. కానీ శంకర్‌ అలా చేయలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ శంకర్‌పై గుర్రుగా ఉన్నారు. 

మరోవైపు పాత కథతో రొటీన్‌ స్క్రీన్‌ప్లే చిరాకు తెప్పించారు శంకర్. చాలా సీన్లు సిల్లీగా ఉన్నాయి. శంకర్‌ మార్క్ ని ఏమాత్రం చూపించలేకపోయాయి. ఆయన అప్‌డేట్‌ కాలేదా? ఆయన పట్టించుకోలేదా? అనేలా ఆయా సీన్లు ఉండటం విచారకరం.

బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌ వంటి వారు కామెడీగా వాడుకోలేకపోయాడు. వీళ్లసీన్లు సిల్లీగా ఉంటాయి. అప్పన్న ఎపిసోడ్‌ని బాగా చూపించలేకపోయారు. క్లైమాక్స్ ని రొటీన్‌గా చేశారు. ముందు ఎలా ఉన్నా, క్లైమాక్స్ వేరే లెవల్‌లో ఉండాలి. అప్పుడే ఆడియెన్స్ ఎక్కుతుంది. కానీ శంకర్‌ అక్కడే చేతులేత్తేశాడు.
 

ప్రస్తుతం ఆడియెన్స్ సందేశాలు చూసే పరిస్థితుల్లో లేదు. పైగా రాజకీయాల్లో సందేశాలంటే అందరికి బోరింగ్‌ సబ్జెక్ట్ అయిపోయింది. ఊరమాస్‌ సినిమాలతో, హీరోని విలన్‌గా చూపిస్తేనే జనం చూస్తున్న ఈరోజుల్లో, హీరో మంచిగా ఉంటే జనం పట్టించుకోవడం లేదు. సందేశాల జోలికే వెళ్లడం లేదు. ఆ విషయంలో శంకర్‌ చాలా అప్ డేట్‌ కావాల్సిన అవసరం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

read more: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ OTT రిలీజ్ డేట్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

also read: `అఖండ 2` తర్వాత నేనేంటో చూపిస్తా.. బాలకృష్ణ ఊరమాస్‌ కామెంట్స్.. నన్ను చూసి నాకే పొగరు

Latest Videos

click me!