మొదటిసారి రాజకీయ జెండాపట్టింది ఆయనకోసమే : మోదీ
నిఖిల్ కామత్ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ తన చిన్నప్పటి సంఘటనను గుర్తుచేసుకున్నారు. గుజరాత్ లోని వాద్ నగర్ లో తాను పుట్టిపెరిగానని... చిన్నతనంలో ఆ ఊళ్లో బసంత్ భాయ్ పారిఖ్ అనే ఒక వైద్యుడు ఉండేవారని గుర్తుచేసారు. ఆయన కంటి వైద్య నిపుణుడు... మంచి వక్త, హిందీ, గుజరాతీలో అనర్గళంగా మాట్లాడగరు. ప్రజలకు సేవ చేయాలని ఆయన తాపత్రయపడేవారు. ఈ క్రమంలోనే ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని ప్రధాని తెలిపారు.
ఆయన కోసం మొదటిసారి తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని... స్నేహితులమంతా కలిసి వానరసేనలా మారి జెండా పట్టుకుని ఆయన వెంట తిరిగామని ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఆయన ప్రజల నుండి ఎన్నికల కోసం ఒక్కో రూపాయి తీసుకున్నారని... ఆ తర్వాత ఒక బహిరంగ సభలో ఆ డబ్బుల లెక్క చెప్పారని ప్రధాని తెలిపారు. మొత్తం రెండువందల యాభై రూపాయలు వచ్చాయని... ఆ మొత్తాన్ని ఎలా ఖర్చుచేసింది డాక్టర్ బసంత్ భాయ్ వివరించారని ప్రధాని తెలిపారు.
ఈ ఎన్నికల్లో చాలా తక్కువ ఓట్లతో బసంత్ భాయ్ గెలిచారు... కానీ గెలిచారని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ స్టోరీ ఎందుకు చెబుతున్నానంటే ఆయన చాలామంది వ్యక్తి... కానీ చాలా తక్కువ ఓట్లతో గెలిచారు. ఇలా ప్రజలకు సేవ చేయాలనే ఆయన ప్రయత్నం ఫలించిందన్నారు.