కుప్పకూలిన విమానం : 72 మంది ప్రమాణికులతో వెళుతుండగా ఘోరం 

By Arun Kumar P  |  First Published Dec 25, 2024, 1:05 PM IST

ప్రయాణికుల విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలిన ఘటన కజకిస్తాన్ లో చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమయంలో విమానంలో 72మంది ప్రయాణికులు వున్నారు.


కజకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 72 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానం ఖజకిస్తాన్ లోని అక్తావు నగర సమీపంలో కూలిపోయింది. ఈ విమానప్రమాదాన్ని రష్యా న్యూస్ ఏజన్సీ దృవీకరించింది. 

అజర్ బైజాన్ కు చెందిన విమానం రాజధాని బాకు నుండి రష్యాలోని గ్రోజ్నికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. గ్రోజ్నిలో పొగమంచు కారణంగా విమానం ల్యాండ్ కాలేకపోయింది. ఈ క్రమంలోనే విమానాన్ని దారి మళ్లించారు. దగ్గర్లోని కజకిస్తాన్ లో ల్యాండింగ్ కు ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్ పోర్ట్ వద్దకు చేరుకున్న విమానం ల్యాండింగ్ సమస్యను ఎదుర్కొంది... దీంతో కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని రష్యా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 

Latest Videos

undefined

విమాన ప్రమాదం జరిగిన వెంటన కజకిస్తాన్ ఎమర్జెన్సీ మంత్రిత్వ శాఖ సహాయక చర్యలు చేపట్టింది. అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన  పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. 
 


 

click me!