మావో సరసన జిన్‌పింగ్.. చరిత్రాత్మక తీర్మానానికి ఆమోదం.. మరోసారి ఆయనే అధ్యక్షుడు!

By telugu teamFirst Published Nov 11, 2021, 6:50 PM IST
Highlights

చైనా రాజధాని బీజింగ్‌లో సోమవారం నుంచి చైనీస్ కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులతో ప్లీనరీ జరిగింది. ఇందులో చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానం కమ్యూనిస్టు పార్టీ సాధించిన విజయాలను, సవాళ్లను, భవిష్యత్‌లో అవలంబించాల్సిన విధానాలను చర్చించింది. ఇలాంటి తీర్మానం ఇప్పటి వరకు మావో జెడాంగ్, డెంగ్ పియావోంగ్ మాత్రమే ప్రవేశపెట్టారు. తాజా తీర్మానంతో వారి సరసన జిన్‌పింగ్ నిలవబోతున్నారు. అంతేకాదు, మరోసారి అధ్యక్ష పదవినీ దాదాపు ఖరారు చేసుకున్నట్టే అని తెలుస్తున్నది.
 

న్యూఢిల్లీ: చైనీస్ కమ్యూనిస్టు పార్టీ చరిత్రాత్మక తీర్మానాన్ని పాస్ చేసింది. దీని ద్వారా ప్రస్తుత China అధ్యక్షుడు Xi Jingping స్థానం రాజకీయ చరిత్రలో మరింత సుస్థిరంగా నిలవనుంది. ఈ తీర్మానాన్ని ఆమోదించడంతో దేశ గొప్ప నేతల్లో ఒకరిగా జిన్‌పింగ్ నిలవనున్నారు. మావో జెడాంగ్(Mao Zedong), డెంగ్ జియావోపింగ్‌ల సరసన ఆయన నిలవనున్నారు. Chinese Communist Party అత్యున్నత సమావేశం జరిగింది. ఆరవ ప్లీనరీ సమావేశంలో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. వచ్చే ఏడాది జరగనున్న నేషనల్ కాంగ్రెస్‌కు ముందు ఈ సమావేశం జరిగింది. తాజా తీర్మానంతో నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో మరోసారి అధ్యక్ష బాధ్యతలను జీ జిన్‌పింగ్‌కే దక్కనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

చైనా రాజధానిలో నిర్వహించిన ప్లీనరీలో సుమారు 400 మంది కీలకమైన పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇందులో పార్టీ సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, భవిష్యత్‌లో అనుసరించాల్సిన విధానాలకు సంబంధించిన చరిత్రాత్మక తీర్మానాన్ని(Historical Resolution) ఆమోదించారు. ఇలాంటి తీర్మానాలను ఇప్పటి వరకు 1945లో మావో జెడాంగ్, 1981లో ఆయన తర్వాత బాధ్యతలు తీసుకున్న డెంగ్ జియావోపింగ్ చేపట్టారు. మావో జెండాంగ్, డెంగ్ జియావోపింగ్‌లు చేసిన తీర్మానాలు అప్పటి వరకు ఉన్న పరిస్థితులను మొత్తంగా మార్చే విధంగానే ఉన్నాయి. 1945నాటి తీర్మానంతో మావో జెడాంగ్ బలమైన నాయకుడిగా మారడంతోపాటు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను క్రియేట్ చేయగలిగాడు. కాగా, డెంగ్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మావో జెండాగ్ తప్పులను ఎత్తిచూపి ఆర్థిక సంస్కరణలకు ప్రాధాన్యత ఇచ్చారు.

Also Read: ఇండియాలోనే ఉంటా..! కమ్యూనిజాన్ని సమర్థిస్తా.. సంకుచిత చైనా నేతలతోనే సమస్య.. దలైలామా సంచలన వ్యాఖ్యలు

కాగా, జీ జిన్‌పింగ్ మాత్రం తన తీర్మానం ద్వారా ప్రస్తుత విధానాలనే ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. డెంగ్ హయాంలో ప్రారంభమైన దశబ్దాల నాటి వికేంద్రీకరణ వైపు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టు కొందరు నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ‘జి థాట్’ అనే పంథాను అవలంబించాలని తీర్మానం పేర్కొన్నట్టు తెలుస్తున్నది. జీ జిన్ పింగ్ ప్రత్యేకంగా ఒక పొలిటికల్ స్ట్రాటజీని రూపొందించారని సమాచారం. దీని గురించి స్కూల్ పాఠశాలల్లోనూ బోధిస్తున్నారు. కాగా, చైనా జాతీయ చరిత్రలో జిన్‌పింగ్ తనకు ఒక ఉన్నత స్థానాన్ని ఏర్పరుచుకునే ఆరాటం పడుతున్నాడని మరికొందరు పేర్కొంటున్నారు. చరిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టి పార్టీ తీరు.. ఆధునిక చైనాకు కేంద్ర స్థానంలో తనను నిలబెట్టుకున్నాడని తెలిపారు. ఈ డాక్యుమెంట్ల ద్వారా జిన్ పింగ్ తన బలాన్ని  నిరూపించుకున్నవాడయ్యారని వివరిస్తున్నారు. ఇది తాను అధికారంలోనే కొనసాగడానికి ఒక పరికరంగా ఉపకరిస్తుందనీ పేర్కొంటున్నారు. రెండు సార్లు మాత్రమే అధ్యక్ష పదవికి అర్హులనే నిబంధనను 2018లోనే చైనా తొలగించింది. తద్వార జీ జిన్‌పింగ్ తన జీవితాంతం అధ్యక్షుడిగా కొనసాగడానికి అవకాశాన్ని కల్పించుకున్నారు.

Also Read: చైనాను నమ్మొద్దు.. అలీన విధానాన్ని వదిలేయాలి.. భారత యువత ఏం ఆలోచిస్తున్నదంటే..!

కొన్ని దశాబ్దాల క్రితం నాటి చైనా.. ప్రస్తుత ఉన్నత స్థానాన్ని అందుకుంటుందని ఊహించడమే కష్టతరంగా ఉండేది. ఇప్పుడు చైనా ఆర్థికంగా టెక్నాలజీ పరంగా, మిలిటరీ పరంగా, అంతర్జాతీయంగానూ ఒక అగ్రదేశ స్థానాన్ని సాధించుకుంది. వీటన్నింటినీ ఈ తీర్మానం చర్చించింది. చైనా ఉన్నత రాజకీయాలు చాలా నిగూఢంగా ఉంటాయని, వాటిని అంచనా వేయడం చాలా కష్టమని ఓ రాజకీయ నిపుణుడు చెప్పాడు. ఎన్ని ఊహాగానాలు వచ్చినా.. అక్కడ వాస్తవంగా జరిగిందేమిటనేది చాలా వరకు బయటకు రాకుండానే ఉంటుందని అన్నాడు.

click me!