స్వలింగ సంపర్కుల వల్లే మంకీ పాక్స్ వ్యాప్తి..?

By telugu news teamFirst Published May 24, 2022, 10:43 AM IST
Highlights

మంకీ పాక్స్ వ్యాధి సోకిన వ్యక్తితో ఇంట్లో కానీ.... లేదంటే బయట కానీ.. సన్నిహితంగా ఉన్నవారు తాము ఎప్పుడు ఎవరిని ఎక్కడ కలిశాము అనే వివరాలను అధికారులకు చెప్పాలని సూచించారు. 

మొన్నటి వరకు కరోనా మహమ్మారి తో ప్రపంచం మొత్తం పోరాడింది. ఈ మహమ్మారి నుంచి కాస్త బయటపడి.. ఇప్పుడిప్పుడే ప్రజలు సామాన్య జీవితాన్ని గడుపుతున్నారు. కాగా.. ఈ సమయంలో మంకీ పాక్స్ రూపంలో మరో మహమ్మారి ముంచుకు వస్తోంది. ఈ నెల ప్రారంభంలో ఇప్పటికే బ్రిటన్ లో మంకీ పాక్స్ కేసులు ప్రారంభం అయ్యాయి. ఆ తర్వాత అక్కడి నుంచి పలు దేశాల్లో ఈ కేసులు నమోదు అవ్వడం మొదలయ్యాయి. దీంతో... ఈ కేసుల నేపథ్యంలో  బ్రిటీష్ ఆరోగ్య రక్షణ సంస్థ కొత్త ఆదేశాలు జారీ చేసింది.

మంకీ పాక్స్ వ్యాధి సోకిన వ్యక్తికి దగ్గరగా ఉన్నవారు.. 21 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలని బ్రిటీష్ ఆరోగ్య రక్షణ సంస్థ సూచించింది. మంకీ పాక్స్ వ్యాధి సోకిన వ్యక్తితో ఇంట్లో కానీ.... లేదంటే బయట కానీ.. సన్నిహితంగా ఉన్నవారు తాము ఎప్పుడు ఎవరిని ఎక్కడ కలిశాము అనే వివరాలను అధికారులకు చెప్పాలని సూచించారు. సన్నిహితంగా ఉన్నవారందరూ.. ఎవరినీ కలవకుండా 21 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలని.. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు, వృద్ధులు, 12ఏళ్ల లోపు చిన్నారులకు దూరంగా ఉండాలని సూచించారు.

ఆఫ్రికా మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో కోతుల్లో కనిపించే ఈ వ్యాధి అక్కడి నుంచి ఐరోపా,బ్రిటన్ దేశాలకు పాకింది. బ్రిటన్ లోని 20, ఐరోపా, అమెరికా, కెనడా, ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా దేశాల్లో 80 మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా కోతుల్లో కనిపించే ఈ వైరల్ వ్యాధి అంత తేలికగా మనుషులకు సంక్రమించదట. కానీ.. మంకీ పాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్నవారికి మాత్రం వెంటనే సోకుతుందట. అదేవిధంగా లైంగిక ప్రక్రియ ద్వారా కూడా ఇది వ్యాపిస్తుందట.

ఇటీవల స్పెయిన్, బెల్జియంలలో జరిగిన రెండు రేవ్ పార్టీలలో పాల్గొన్న స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులైన పురుషులకు మంకీ పాక్స్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారు డాక్టర్ డేవిడ్ హైమన్ తెలిపారు. అలాంటి వారితో సెక్స్ లో పాల్గొన్నా.. కనీసం.. పీపీఈ సూట్ లేకుండా దుప్పట్లు మార్చినా కూడా.. వారికి కూడా మంకీ పాక్స్ రావడం ఖాయమని హెచ్చరించారు.

మంకీ పాక్స్ లక్షణాలు..
విపరీతమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, చర్మం మీద బొబ్బలు రావడం ఈ వ్యాది ప్రధాన లక్షణాలు. ఈ వ్యాధి పెద్దల్లో స్వల్ప లక్షణాలను మాత్రమే కనపరుస్తుంది. పిల్లల్లో దీని ప్రభావం చాలా ఎక్కువ. సాధారణ జనాభాకు ఈ వ్యాధి వల్ల ప్రమాదం కాస్త తక్కువే. అయినప్పటికీ.. ఈ వ్యాధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తోంది.

click me!