Ghee Coffee Benefits: నెయ్యి కాఫీతో ఎన్ని లాభాలో తెలిస్తే.. తాగకుండా ఉండరు!

Published : May 31, 2025, 05:46 PM IST
Ghee Coffee Benefits: నెయ్యి కాఫీతో ఎన్ని లాభాలో తెలిస్తే.. తాగకుండా ఉండరు!

సారాంశం

కాఫీని చాలామంది ఇష్టంగా తాగుతారు. రోజుకు ఐదారు సార్లు కాఫీ తాగేవాళ్లు కూడా లేకపోలేదు. కాఫీలో చాలా రకాలుంటాయి. కానీ ఎప్పుడైనా నెయ్యి కాఫీ ట్రై చేశారా? నెయ్యి కాఫీ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవెంటో ఇక్కడ చూద్దాం.

 

కాఫీని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. కొందరైతే... ఉదయం, సాయంత్రంతో పాటు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు.. కప్పులు, కప్పులు కాఫీ తాగుతూనే ఉంటారు. కానీ కాఫీలో ఎప్పుడైనా నెయ్యి వేసుకొని తాగారా? కాఫీలో కొంచెం నెయ్యి కలుపుకొని తాగితే చాలా లాభాలున్నాయట. అవెంటో ఇక్కడ చూద్దాం.

నెయ్యిలోని పోషకాలు  

నెయ్యి ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. ముఖ్యంగా నెయ్యిలో ఉండే బ్యూటిరెట్ అనేది గట్ హెల్త్‌కి చాలా మంచిది. ఇందులో A, D, E, K వంటి కొవ్వులో కరిగే విటమిన్లు కూడా ఉన్నాయి.

మెరుగైన జీర్ణక్రియ 

కాఫీలో నెయ్యి కలపడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనం తర్వాత తరచుగా కడుపులో ఉబ్బరం లేదా అసౌకర్యంగా అనిపించేవారికి.. నెయ్యిలోని బ్యూటిరెట్ యాసిడ్ మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు పేగుల వాపును తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

రోగనిరోధక శక్తి 

నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా విటమిన్ ఎ ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటుంది. నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

హార్మోన్ల అసమతుల్యత   

నెయ్యి కాఫీ.. పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. అంతేకాదు.. వాపు, హార్మోన్ల అసమతుల్యతను తగ్గిస్తుంది. నెయ్యిలో మంచి కొవ్వులు ఉండటం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఒక చెంచా నెయ్యిని కాఫీలో కలిపి తాగితే గుండె ఆరోగ్యానికి మంచిది.

చర్మ ఆరోగ్యానికి.. 

నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు చర్మానికి మేలు చేస్తాయి. చర్మం పొడిబారడాన్ని తగ్గించి, లోపలి నుంచి పోషణనిస్తాయి. చర్మానికి సహజమైన మెరుపును ఇస్తాయి. నెయ్యిలోని A, D, E, K విటమిన్లు ఆరోగ్యకరమైన చర్మానికి తోడ్పడతాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cancer Risk Habits: మీరు రోజు చేసే ఈ 5 తప్పులే క్యాన్సర్‌కు కారణం.. వెంటనే మారకపోతే డేంజరే !
Mutton Health Risks: మీరు తినే మటన్‌లో ఈ పార్ట్స్ ఉన్నాయా? అయితే మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే