Health tips: యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ ఫుడ్స్ తినండి!

Published : May 30, 2025, 02:19 PM IST
Health tips: యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ ఫుడ్స్ తినండి!

సారాంశం

శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరగడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. యూరిక్ యాసిడ్ ను సహజంగా తగ్గించే ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

యూరిక్ యాసిడ్ శరీరానికి అవసరమైనదే అయినప్పటికీ... దీని పరిమాణం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, కిడ్నీ సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ ను సహజంగా తగ్గించి, గౌట్ సమస్య రాకుండా చేసే కొన్ని ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1. చెర్రీస్

చెర్రీస్ లో ఉండే ఆంథోసైనిన్లు యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, వాపును తగ్గిస్తాయి.

2. నిమ్మకాయ

విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మకాయ, ఇతర సిట్రస్ పండ్లు తినడం, నిమ్మరసం తాగడం ద్వారా యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

3. దోసకాయ

దోసకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. ప్యూరిన్లు తక్కువగా ఉంటాయి. ఇది యూరిక్ యాసిడ్ ని బయటకు పంపడానికి సహాయపడుతుంది.

4. గ్రీన్ టీ

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే గ్రీన్ టీ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.

5. అవిసె గింజలు

అవిసె గింజల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ ను తగ్గించి, కీళ్ల నొప్పులు రాకుండా చూస్తాయి.

6. అల్లం

అల్లంలో ఉండే జింజెరాల్ కి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది గౌట్ వల్ల వచ్చే లక్షణాలను తగ్గిస్తుంది.

గమనిక: 

డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాతే మీ ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం