Coconut Water: కొబ్బరి నీళ్లు వీళ్లు మాత్రం తాగకూడదు

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, కొందరికి మాత్రం మంచిది కాదట. మరి, ఎవరు తాగకూడదో తెలుసుకుందాం...


ఎండాకాలం వచ్చింది అంటే చాలు.. అందరికీ ముందు గుర్తుకు వచ్చేది కొబ్బరి నీళ్లే. అందరికీ అందుబాటులో ఉంటాయి.. ధర కూడా సరళంగా ఉంటుంది. కాబట్టి.. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి ఈ కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు. అంతేకాదు, ఈ  నీటి లో చాలా పోషకాలు కూడా ఉంటాయి. ఆరోగ్యానికి ప్రయోజనాలు కలిగించే విటమిన్లు అందులో పుష్కలంగా ఉంటాయి.చాలా రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించే సత్తా ఉన్న ఈ కొబ్బరి నీటిని కొందరు మాత్రం అస్సలు తాగకూడదని మీకు తెలుసా? మీరు చదివింది నిజమే,  కొబ్బరి నీళ్లు కొంతమంది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మీరు ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగితే, దాని దుష్ప్రభావాల గురించి కూడా తెలుసుకోవాలి.

హై బ్లడ్ షుగర్ లెవెల్ ఉన్న డయాబెటిస్ రోగులకు కొబ్బరి నీళ్లు హానికరం. కొబ్బరి నీళ్లు తాగితే బ్లడ్ షుగర్ లెవెల్ పెరుగుతుంది. అందుకే మీ బ్లడ్ షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటే, కొబ్బరి నీళ్లు తాగకూడదు. అంతేకాకుండా, మీకు కిడ్నీ సమస్యలు ఉంటే, ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగకూడదు.

Latest Videos

జలుబు, జ్వరం పెరిగే అవకాశం ఉంది. మీకు జలుబు లేదా జ్వరం ఉంటే, కొబ్బరి నీళ్లను మీ ఆహారంలో చేర్చుకోకండి. కొబ్బరి నీళ్ల స్వభావం చల్లగా ఉంటుంది. జలుబు, జ్వరం ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యం మరింత దిగజారుతుంది. కొంతమందికి కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అలర్జీ సమస్యలు కూడా వస్తాయి. దీనివల్ల దురద, మంట లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. అలాంటివారు కూడా కొబ్బరి నీళ్లు తాగకూడదు.

అధిక రక్తపోటు సమస్య. మీ రక్తపోటు తక్కువగా ఉంటే, కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు రక్తపోటును పెంచడానికి సహాయపడతాయి. కానీ మీ రక్తపోటు ఎక్కువగా ఉంటే, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి హానికరం. అందుకే, ఇలాంటి సమస్య ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగకపోవడమే మంచిది.

click me!