Hair Growth: మన శరీరంలో జింక్ విటమిన్ లోపిస్తే జుట్టు బాగా రాలుతుంది. అందుకే..జుట్టు రాలడం తగ్గాలంటే.. ఆ జింక్ మనకు అందించే ఫుడ్స్ తీసుకోవడం మొదలుపెట్టాలి. ఈ జింక్ కనుక ఉంటే.. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగడమే కాకుండా.. మన చర్మం కూడా అందంగా మారుతుందట.
Hair Growth: ఈరోజుల్లో జుట్టు విపరీతంగా రాలిపోతుందని బాధపడేవారు చాలా మంది ఉన్నారు.ఊడిపోతున్న జుట్టును చూస్తూ బాధపడుతూ ఉంటారు. దీనిని కంట్రోల్ చేయడానికి ఏవేవో షాంపూలు, సీరమ్స్, నూనెలు అంటూ పూసేస్తూ ఉంటారు. అయితే..వాటితో సంబంధం లేకుండా కొన్ని రకాల ఫుడ్స్ తినడం అలవాటు చేసుకుంటే.. జుట్టు చాలా తక్కువ సమయంలోనే ఒత్తుగా పెరుగుతుందట. మరి, అవేంటో తెలుసుకుందామా...
27
మన శరీరంలో జింక్ విటమిన్ లోపిస్తే జుట్టు బాగా రాలుతుంది. అందుకే..జుట్టు రాలడం తగ్గాలంటే.. ఆ జింక్ మనకు అందించే ఫుడ్స్ తీసుకోవడం మొదలుపెట్టాలి. ఈ జింక్ కనుక ఉంటే.. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగడమే కాకుండా.. మన చర్మం కూడా అందంగా మారుతుందట.మరి, జింక్ పుష్కలంగా ఉండే ఆహారాలేంటో చూద్దాం...
37
pumpkin seeds
గుమ్మడికాయ గింజలు
గుమ్మడికాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఈ గింజల్లో జింక్ తో పాటు జుట్టు ఆరోగ్యానికి దోహదపడే ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లతో కూడా నిండి ఉంటాయి.వీటిని స్నాక్స్ లా తినడానికి లేదా సలాడ్లు లేదా స్మూతీస్ వంటి వాటిలో కలిపి తీసుకోవచ్చు. గుమ్మడికాయ గింజలు జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచేందుకు, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి , జుట్టు సన్నబడకుండా నిరోధించడానికి శరీరానికి అవసరమైన జింక్‌ను సరఫరా చేస్తాయి. అదనంగా, గుమ్మడికాయ గింజలు మెగ్నీషియంను కూడా కలిగి ఉంటాయి, ఇది తలపై ప్రసరణను మెరుగుపరచడం ద్వారా ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహించడంలో సహాయపడుతుంది, జుట్టు కుదుళ్లకు తగినంత పోషకాలు అందేలా చేస్తుంది.
47
spinach
పాలకూర
పాలకూరలో జింక్, ఐరన్, విటమిన్లు A, C వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి బలమైన , పోషకమైన జుట్టును నిర్వహించడానికి అవసరం. ఐరన్ జుట్టు కుదుళ్లకు మెరుగైన ఆక్సిజన్ ప్రసరణను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది, అయితే జింక్ జుట్టు పెరుగుదలకు కారణమయ్యే హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. పాలకూరను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా, మీ జుట్టు రాలడం సమస్య ఉండదు.
57
Benefits of having soaked cashew daily
జీడిపప్పు..
జీడిపప్పు లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇవి రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన జుట్టును అందించడంలోనూ సహాయం చేస్తుంది. మరీ ఎక్కువ తీసుకోకుండా.. జీడిపప్పును మితంగా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆరోగ్యం. ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.
67
chickpeas
శనగలు..
వీటిలోనూ జింక్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో ప్రోటీన్, బయోటిన్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా జుట్టు పెరగడానికి సహాయపడతాయి. వీటిని కూడా ఏదో ఒక రూపంలో రెగ్యులర్ గా తీసుకుంటే.. కచ్చితంగా జుట్టు రాలదు. పైగా, ఒత్తుగా కూడా పెరుగుతుంది.
77
moongdal
పెసరపప్పు..
పెసరపప్పులోనూ జింక్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి. కాబట్టి.. వీటన్నింటినీ రెగ్యులర్ గా మన డైట్ లో భాగం చేసుకుంటే.. ఖరీదైన నూనెలు, షాంపూల అవసరం లేకుండా.. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు.జుట్టు రాలడాన్ని కూడా తగ్గించుకోవచ్చు.