Skin Care: రాత్రి పడుకునే ముందు ఇవి చేస్తే పార్లర్ అవసరం ఉండదు..!

Published : Mar 22, 2025, 02:11 PM IST

మనం రెగ్యులర్ గా స్కిన్ కేర్ ఫాలో అవ్వడం వల్ల.. మన చర్మాన్ని పూర్తిగా యవ్వనంగా మార్చకపోయినా.. ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించేలా మాత్రం చేయచ్చు.

PREV
14
Skin Care: రాత్రి పడుకునే ముందు ఇవి చేస్తే పార్లర్ అవసరం ఉండదు..!

వయసు పెరుగుతున్నా యవ్వనంగా మెరిసిపోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ, వయసు పెరుగుతుంటే మన ముఖంలోని అందం మెల్లమెల్లగా తగ్గిపోవడం మొదలౌతుంది. కానీ, మనం రెగ్యులర్ గా స్కిన్ కేర్ ఫాలో అవ్వడం వల్ల.. మన చర్మాన్ని పూర్తిగా యవ్వనంగా మార్చకపోయినా.. ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించేలా మాత్రం చేయచ్చు. మరి, దానికోసం రాత్రి పూట పడుకునే ముందు కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలట. మరి, అవేంటో చూసేద్దామా..
 

24

1.మేకప్ తొలగించడం..

ఈ రోజుల్లో మేకప్ వేసుకోవడం చాలా కామన్ అయిపోయింది.అందంగా కనిపించడానికి మేకప్ వేసుకోవచ్చు. కానీ.. రాత్రిపడుకునే ముందు ఆ మేకప్ ని పూర్తిగా తొలగించాలి. ఆ తర్వాతే పడుకోవాలి. లేదంటే.. మీ చర్మం మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే.. పడుకునే ముందు క్లెన్సర్ తో శుభ్రం చేసుకుంటే.. మీ స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది.

34
skin care

మీ ముఖం కడుక్కోండి.
మీరు పగటిపూట ముఖం కడుక్కోకపోయినా, రాత్రిపూట అలా చేయడం ముఖ్యం. మురికి, నూనె , మలినాలను తొలగించడానికి సున్నితమైన క్లెన్సర్‌ను ఉపయోగించండి. ఇది చాలా బాగా పని చేస్తుంది. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి టోనర్ వాడాలి.  ఇది మీ చర్మాన్ని pHని సమతుల్యం చేయడంలో, చర్మం పై ఓపెన్ పూర్స్ రాకుండా కాపాడుతుంది.

ఐ క్రీమ్ ఉపయోగించండి
కళ్ల కింద ఉన్న ప్రాంతం చాలా సన్నని, చాలా సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటుంది, ఇది వృద్ధాప్య ప్రారంభ సంకేతాలకు గురవుతుంది. మీ ఇరవైలలో ఐ క్రీమ్‌ను ఉపయోగించడం ప్రారంభించండి. ఉత్తమ ఫలితాల కోసం ప్రతి రాత్రి దానిని సున్నితంగా మసాజ్ చేయండి.

44
skin care

హైడ్రేటెడ్ గా ఉండండి.

మీ మంచం పక్కన ఒక బాటిల్ వాటర్ ఉంచుకుని రాత్రంతా త్రాగండి. ఈ అలవాటు పెరగడానికి సమయం పట్టవచ్చు, కానీ ఇది ఉదయం మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. అందంగా కనిపించేలా చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories