Isha Ambani: అంబానీ కూతురు ఇషా ఏం తిని బరువు తగ్గిందో తెలుసా?

Published : Mar 22, 2025, 01:28 PM IST

ముకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ  ఎలాంటి ఫుడ్ తిని ఈజీగా బరువు తగ్గిందో తెలుసా? 

PREV
14
Isha Ambani:  అంబానీ కూతురు ఇషా ఏం తిని బరువు తగ్గిందో తెలుసా?
isha ambani weight loss diet carbs rich food secrets

మన దేశ కుబేరుడు ముకేష్  అంబానీకి పరిచయం అవసరం లేదు. ఆయన ఒకైక కుమార్తె ఇషా అంబానీ కి కూడా అందరికీ సుపరిచితమే. తల్లి నీతా అంబానీ లాగానే ఇషా కూడా ఫిట్నెస్ ప్రీక్. అయితే.. ఒకప్పుడు ఇషా కూడా అధిక బరువుతో బాధపడిందట.  కానీ.. సరైన డైట్ ఫాలో అయ్యి.. చాలా బరువు తగ్గింది. అయితే.. బరువు తగ్గడానికి ఆమె కార్బ్స్( రైస్, రోటీ లాంటివి) వదిలేసి.. ప్రోటీన్ , ఫైబర్ మాత్రమే తినలేదట. కార్బ్స్ కూడా తీసుకునే బరువు తగ్గిందట. మరి, ఏం తిన్నదో తెలుసుకుందామా..



 

24
ఇషా అంబానీకి ఇష్టమైన ఫుడ్

తండ్రి ముఖేష్ అంబానీలాగే కూతురు ఇషా అంబానీ కూడా ఫుడ్ లవర్. బరువు తగ్గడానికి ఆమె కార్బ్స్ తినడం ఎప్పుడూ ఆపలేదు. తాను కార్బ్ బేబీనని ఇంటర్వ్యూలో చెప్పింది. అంటే కార్బోహైడ్రేట్లు ఉన్న ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందులో ఫ్రెంచ్ ఫ్రైస్, బ్రెడ్ టోస్ట్, వడా పావ్, మాష్డ్ పొటాటో, మ్యాగీ నూడుల్స్ ఉన్నాయి.

ఫాస్ట్ ఫుడ్‌తో పాటు ఇషా అంబానీకి గుజరాతీ ఫుడ్ అంటే ఇష్టం. అందులో గుజరాతీ వెజిటేబుల్ ఫ్రై, డ్రై దాల్, శనగల కూర, బీన్స్ ఉన్నాయి. మధ్యాహ్నం భోజనంలో గుజరాతీ ఫుడ్ తింటుంది. చీట్ డే రోజు పూరీ, అన్నం, స్వీట్ తింటుంది.

34
ఫిట్‌నెస్‌పై ఇషా అంబానీ శ్రద్ధ

ఇషా అంబానీ ఎక్కువ కార్బ్స్ తింటుంది. అంతే ఎక్కువ టైమ్ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడుతుంది. స్పోర్ట్స్, జిమ్, యోగా, రన్నింగ్‌తో క్యాలరీలు బర్న్ చేస్తుంది. ప్రతిరోజు దాదాపు 10 వేల అడుగులు నడుస్తుంది. ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తింటే, క్యాలరీలు బర్న్ చేయడం కూడా అవసరమని ఆమె అంటుంది.

44
నార్మల్ డేస్‌లో షుగర్‌కు దూరం

ఇషా అంబానీకి స్వీట్ అంటే ఇష్టం. కానీ ఫిట్‌నెస్ డే రోజు షుగర్‌కు దూరంగా ఉంటుంది. చక్కెర బదులు తేనె తింటుంది. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే దీన్ని తినొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories