Ovarian Cancer: మహిళలకు వచ్చే క్యాన్సర్లలో అండాశయ క్యాన్సర్ గురించి తెలుసా?. ఇది అండాశయాలు లేదా ఫెలోపియన్ ట్యూబ్స్‌లో మొదలయ్యే కణాల పెరుగుదల. ఇది కడుపు, పెల్విస్ భాగాలకు వేగంగా వ్యాపిస్తుంది. ఈ 6 లక్షణాలను నిర్లక్ష్యం చేయోద్దు.
మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో అండాశయ క్యాన్సర్ ఒకటి. ఇది అండాశయాలు లేదా ఫెలోపియన్ ట్యూబ్స్‌లో మొదలవుతుంది. అక్కడి నుంచి పొత్తికడుపు, పెల్విస్ భాగాలకు వేగంగా వ్యాపిస్తుంది.
27
కణాలలో లేదా అండాశయం చుట్టూ ఉండే కణజాలంలో క్యాన్సర్ రావచ్చు
ఈ క్యాన్సర్ లక్షణాలు మొదట్లో పెద్దగా కనిపించవు. అందుకే దీన్ని గుర్తించడం చాలా ఆలస్యం అవుతుంది. అండాశయం పైపొరలో, అండాలను ఉత్పత్తి చేసే కణాలలో లేదా అండాశయం చుట్టూ ఉండే కణజాలంలో ఈ క్యాన్సర్ రావచ్చు.
37
PCOS, బరువు పెరగడం వల్ల అండాశయ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.
అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల భారతీయ మహిళల్లో PCOS కేసులు పెరుగుతున్నాయి. PCOS వల్ల బరువు పెరుగుతారు. ఈ PCOS, పెరిగిన బరువు.. రెండూ అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
వయసు, వారసత్వం, ఊబకాయం, జీవనశైలి అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
వయసు, వారసత్వం, ఊబకాయం, జీవనశైలి వంటివి అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ప్రధాన కారణాలు. ఈ క్యాన్సర్ మూత్రాశయం, గర్భాశయానికి నేరుగా లేదా లింఫాటిక్ సిస్టమ్ ద్వారా వ్యాపిస్తుంది.
57
వ్యాధిని ముందుగా గుర్తించడంలో రెగ్యులర్ చెకప్‌లు ముఖ్య పాత్ర పోషిస్తాయి.
అండం తక్కువగా విడుదలవడం వల్ల అండాశయ కణాల్లో DNA దెబ్బతినే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాధిని ముందుగా గుర్తించి, సరైన చికిత్స అందించడంలో రెగ్యులర్ చెకప్‌లు కీలక పాత్ర పోషిస్తాయి.
67
ఈ ఆరు లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు
తరచుగా కడుపు ఉబ్బరంగా ఉండటం, తినడానికి ఇబ్బంది పడటం, కొంచెం తినగానే కడుపు నిండినట్లు అనిపించడం, తరచుగా మూత్ర విసర్జన, పొత్తికడుపులో నొప్పి వంటివి అండాశయ క్యాన్సర్ లక్షణాలు.
77
సరైన పరీక్షలు (అల్ట్రాసౌండ్ స్కాన్, CA-125 బ్లడ్ టెస్ట్) చేయించుకోవాలి.
పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే గైనకాలజిస్ట్ లేదా ఆంకాలజిస్ట్‌ను సంప్రదించాలి. అల్ట్రాసౌండ్ స్కాన్, CA-125 బ్లడ్ టెస్ట్ వంటి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.