ఒక్కొక్కరి స్కిన్ ఒక్కోలా ఉంటుంది...
జిడ్డు చర్మం ఉన్నవారికి ఆయిల్ ను నియంత్రించే సబ్బులు అవసరం.
పొడి చర్మం ఉన్నవారు మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్న సబ్బులు వాడాలి.
సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు కెమికల్స్ తక్కువగా ఉన్న మైల్డ్ సబ్బులు మాత్రమే వాడాలి.
పిల్లల చర్మం చాలా నాజూకుగా ఉంటుంది. పెద్దల సబ్బులు పిల్లలకు వాడితే స్కిన్ రఫ్ గా మారి రాషెస్, అలర్జీలు కలిగించే ప్రమాదం ఉంటుంది. అందుకే కుటుంబంలో అందరూ ఒకే సబ్బు వాడకూడదు.
సబ్బు కి బదులు ఏం వాడాలి...?
చర్మ నిపుణులు ప్రకారం, ఒకే వస్తువును వాడాలి అనుకుంటే సబ్బు కంటే లిక్విడ్ బాడీ వాష్ లేదా షవర్ జెల్ వాడొచ్చు. దీని వల్ల స్కిన్ సమస్యలు రావు. అందుకే సబ్బుకు బదులు.. బాడీ వాష్ వాడటం ఉత్తమం..
సబ్బు వాడేటప్పుడు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు...
వీలైతే ప్రతి ఒక్కరూ తమ సబ్బును వేరుగా ఉంచుకోవాలి. వాడిన తర్వాత ఎండగా ఉంచితే క్రిముల పెరుగుదల తగ్గుతుంది. సబ్బు పెట్టే డబ్బాను కూడా తరచుగా శుభ్రం చేయాలి. ఇక.. ఏదైనా చర్మ సమస్యలు ఉన్నవారు, ఇన్ఫెక్షన్లు ఉన్నవారు ఒకరి సబ్బును మరొకరు వాడకూడదు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు మాత్రం స్పెషల్ సబ్బులు వాడాలి. ఒకే సబ్బు వాడటం వల్ల వెంటనే సమస్యలు రాకపోయినా, దీర్ఘకాలంలో చర్మ సమస్యలు పెరగవచ్చు.కుటుంబంలో ఎవరికైనా అలర్జీలు ఉంటే, వారి కోసం ప్రత్యేక సబ్బు తప్పనిసరి.
ఒకే సబ్బు వాడటం పూర్తిగా ప్రమాదకరం కాదు కానీ, అది ప్రతి ఒక్కరి చర్మానికి సరిపోతుందనే గ్యారెంటీ లేదు. ఆరోగ్యకరమైన చర్మం కోసం వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సబ్బు ఎంపిక చేసుకోవడం ఉత్తమ మార్గం. ముఖ్యంగా పిల్లలు, సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి విడివిడిగా సబ్బులు వాడటం చాలా మంచిది.