వయసుతో సంబంధం లేకుండా యవ్వనంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అయితే.. ఈ రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే వయసు మళ్లిన వారిలా కనపడుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు 30-35 ఏళ్ల వయసులోనే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. విపరీతంగా జుట్టు రాలిపోవడం, అలసట, ముఖంపై ముడతలు కనిపించడం చాలా కామన్ అయిపోయింది. మరి, చిన్న వయసులోనే ఇలా వయసు మళ్లినవారిలా కనిపించడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. మరి, ఆ కారణాలు ఏంటి? వేటిని మార్చుకుంటే.. మళ్లీ అందంగా మారొచ్చు అనే విషయం తెలుసుకుందాం...
26
1.జంక్ ఫుడ్ తినే అలవాటు...
ఇటీవల కాలంలో ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ తినడం అలవాటుగా మారింది. అవి, ఈజీగా దొరకడం..వంట చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టడం లేదు అనే ఫీలింగ్ తో వీటిని తినడం మొదలుపెట్టారు. కానీ, వాటిలో ఉండే అదనపు నూనె, ఉప్పు, ప్రిజర్వేటివ్ లు శరీర కాణాలకు హాని కలిగిస్తాయి. దీని ప్రభావం మొదట చర్మం, జుట్టుపై కనిపిస్తుంది. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్, గింజలు చేర్చుకోవడం , నీరు ఎక్కువగా తాగడం వల్ల మీరు మళ్లీ యవ్వనంగా మారొచ్చు.
36
2.ధూమపానం, మద్యపానం..
ధూమపానం, మద్యం సేవించడం వల్ల శరీరంలో విషపదార్థాలు పెరుగుతాయి. ఇది చర్మాన్ని నిస్తేజంగా చేయడమే కాకుండా పొడిగా కూడా చేస్తుంది. ఈ అలవాట్లు అకాల ముడతలు, చర్మం వృద్ధాప్యానికి ప్రధాన కారణం అవుతాయి. ఈ అలవాట్లను పూర్తిగా మానేయడం వల్ల మీ చర్మాన్ని మళ్లీ మంచిగా మార్చుకోవచ్చు.
సన్‌స్క్రీన్ ఉపయోగించకుండా ఎండలో బయటకు వెళ్లడం వల్ల మీ చర్మానికి హాని కలుగుతుంది. సూర్యుడి హానికరమైన UV కిరణాలు చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. చర్మంపై మచ్చలు రావడానికి కారణం అవుతాయి. అలాగే, కాలుష్యం మీ చర్మాన్ని పాడు చేస్తుంది. కాబట్టి.. బయటకు వెళ్లేటప్పుడు, ఇంట్లో ఉన్న సమయంలో కూడా రెగ్యులర్ గా సన్ స్క్రీన్ వాడటం చాలా ముఖ్యం.
56
4.లైఫ్ స్టైల్...
ఈ రోజుల్లో నిశ్చల జీవనశైలి సర్వసాధారణమైంది. తక్కువ శారీరక శ్రమ , వ్యాయామం లేకపోవడం వల్ల, రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు, దీని కారణంగా శరీరం అలసిపోయి వృద్ధాప్యంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం , లేదా వాకింగ్ చేయడం లాంటివి చేయాలి.
66
5.నిద్రలేకపోవడం, అధిక ఒత్తిడి..
సరిగా నిద్రలేకపోతే దాని ప్రభావం ముందుగా ముఖంపైనే కనపడుతుంది. కనీసం 8 గంటల నిద్ర చాలా అవసరం. దీనికి తోడు ఒత్తిడి కూడా ఉంటే.. చిన్న వయసులోనే వయసు మళ్లినవారిలా కనిపిస్తారు. అందుకే ప్రతిరోజూ కనీసం 7–8 గంటలు నిద్రపోండి. యోగా, ధ్యానం లేదా నడకను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. ఇవి మీ చర్మాన్ని అందంగా ఉంచడంలో సహాయపడతాయి.