ముల్తానీ మట్టిని ఇలా పెడితే మీ ముఖం అందంగా మెరిసిపోతుంది

Published : Aug 29, 2025, 01:45 PM IST

ముల్తానీ మట్టి మన చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనితో మొటిమల నుంచి నల్ల మచ్చల వరకు ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం దీన్ని ఎలా ఉపయోగించాలంటే? 

PREV
15
ముల్తానీ మట్టి

ముల్తానీ మట్టి ఎన్నో చర్మ సమస్యలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే దీన్నిచాలా బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తారు. ముల్తానీ మట్టిని ముఖానికి పెట్టడం వల్ల మురికి తొలగిపోతుందది. అలాగే నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు, చనిపోయిన కణాలు తొలగిపోతాయి. 

ఈ ముల్తానీ మట్టిని ముఖానికి ఉపయోగించడం వల్ల స్కిన్ క్లియర్ గా కనిపిస్తుంది. మంచి గ్లో వస్తుంది. ముల్తానీ మట్టిలో మెగ్నీషియం, అల్యూమినియం, సిలికేట్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను ఇట్టే తగ్గిస్తాయి.

25
ముల్తానీ మట్టి ప్రయోజనాలు

ఆయిల్ కంట్రోల్

ఆయిల్ ఫేస్ ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల అదనపు సెబమ్ కంట్రోల్ అవుతుంది. అలాగే ఇది ముఖాన్ని డీప్ గా క్లీన్ చేస్తుంది. దీన్ని ఉపయోగిస్తే ముఖంమీదున్న జిడ్డు పోతుంది. ఇది ఒక్క ఆయిల్ ఫేస్ ఉన్నవారికి మాత్రమే కాదు ఇతర చర్మ రకాలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తరచుగా ఉపయోగిస్తే చర్మం డ్రైగా కాదు.

కాంతివంతంగా అవుతుంది

ముల్తానీ మట్టి మంచి ఎక్స్‌ఫోలియేట్ గా పని చేస్తుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పని చేస్తుంది. దీనివల్ల మీ ముఖం కాంతివంతంగా, అందంగా అవుతుంది. అలాగే ముఖం నీట్ గా కనిపిస్తుంది.

35
వాపును తగ్గిస్తుంది

ముల్తానీ మట్టిలో శీతలీకరణ లక్షణాలుంటాయి. ఇది మన ముఖాన్ని చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ ముల్తానీ మట్టిలో కలబంద జెల్ లేదా రోజ్ వాటర్ ను మిక్స్ చేసి ముఖానికి పెడితే ముఖ వాపు, ఎరుపు, మొటిమల వల్ల కలిగే మంట నుంచి ఉపశమనం కలుగుతుంది.

మెరుగైన రక్త ప్రసరణ

రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటేనే మన ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. అయితే మీ ముఖానికి ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ ను వేసుకున్నప్పుడు రక్త ప్రసరణ మెరుగుపడుతుందది. దీంతో మీ స్కిన్ అందంగా మెరిసిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ చర్మం ఉపరితలం కింద రక్త ప్రసరణను పెంచుతుంది.

45
మొటిమలు తగ్గడానికి ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్

మొటిమలను తగ్గించడంలో ముల్తానీ మట్టి బాగా పనిచేస్తుంది. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిలో ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ను, స్పూన్ నిమ్మరసాన్ని వేసి బాగా కలపండి. అలాగే దీనిలో చిటికెడె పసుపును వేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు దీన్ని ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేసుకుంటే సరిపోతుందది. ఈ ఫేస్ ప్యాక్ లోని పసుపు మొటిమలను తగ్గిస్తే నిమ్మరసం చర్మ రంధ్రాలను బిగుతుగా చేయడానికి ఉపయోగపడుతుంది.

55
డల్ స్కిన్ కోసం ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్

రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిలో ఒక టేబుల్ స్పూన్ పాలు, టేబుల్ స్పూన్ ముడి తేనెను వేసి బాగా మిక్స్ చేయండి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి కొన్ని నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ కు ఉపయోగించిన పాలు, తేనె చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. అలాగే ముఖాన్ని ప్రకాశవంతంగా చేయడానికి సహాయపడతాయి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ముఖానికి మంచి పోషణ అందుతుంది.

డ్రై స్కిన్ కోసం ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్

ఈ ఫేస్ ప్యాక్ కోసం రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిలో టీ స్పూన్ కీరదోసకాయ రసం, ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్ ను వేసి బాగా మిక్స్ చేయండి. దీన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ లో చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. చర్మాన్ని డ్రైగా కానీయదు.

Read more Photos on
click me!

Recommended Stories