ఇదొక్కటి పెట్టినా కనుబొమ్మలు మందంగా పెరుగుతాయి

Published : Aug 28, 2025, 07:18 PM IST

 ఒకప్పుడు అయితే కనుబొమ్మలు సన్నగా ఉండాలనుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రతి ఒక్క అమ్మాయి ఒత్తైన కనుబొమ్మలనే ఇష్టపడుతున్నారు. మరి సన్నని కనుబొమ్మలున్న వారు ఏం చేస్తే ఒత్తుగా కనుబొమ్మలు పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

PREV
14
సన్నని కనుబొమ్మలు

కొంతమంది కనుబొమ్మలు మందంగా ఉంటే.. మరికొంతమంది కనుబొమ్మలు పల్చగా, సన్నగా ఉంటాయి. నిజానికి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కనుబొమ్మలు ఒత్తుగా ఉండటాన్నే ఇష్టపడుతున్నారు. మందపాటి కనుబొమ్మలు ముఖాన్ని ఆకర్షణీయంగా, అందంగా కనిపించేలా చేస్తాయి. అయితే కొంతమందికి కనుబొమ్మలు చాలా సన్నగా, పల్చగా ఉంటాయి. ఇలాంటి వారు కనుబొమ్మల వెంట్రుకలు పెరిగేందుకు రకరకాల చిట్కాలను ఫాలో అవుతుంటారు. కానీ అవి అస్సలు మందంగా కావని బాధపడుతుంటారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో మీరు మందపాటి కనుబొమ్మలను పొందొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

24
ఐబ్రో పెన్సిల్

కనుబొమ్మలు నిండుగా, మందంగా కనిపించడదానికి మీరు ఐబ్రో పెన్సిల్ ను ఉపయోగించొచ్చు. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కనుబొమ్మల చుట్టూరా మీరు పెన్సిల్ తో రాయండి. కనుబొమ్మల ఖాళీ ప్రాంతాలను పెన్సిల్ తో నింపేస్తే మీ కనుబొమ్మలు మందంగా కనిపిస్తాయి. అందులోనూ ఇది మీ లుక్ ను ఏ మాత్రం మార్చదు.

34
కనుబొమ్మ జెల్

కనుబొమ్మలు మందంగా కనిపించేందుకు మీరు కనుబొమ్మల జెల్ ను కూడా ఉపయోగించొచ్చు. ఇది మీ లుక్ ను అందంగా, డిఫరెంట్ గా మార్చేస్తుంది. ఒక సారి ట్రై చేశారంటే తేడాను మీరే గమనిస్తారు.

నూనెలను వాడండి

కొన్ని రకాల నూనెలతో కూడా మీరు కనుబొమ్మలను మందంగా పెరిగేలా చేయొచ్చు. కొబ్బరి లేదా ఆముదం, ఉసిరి నూనెలతో కనుబొమ్మలను మందంగా పెరిగేలా చేయొచ్చు. ఇందుకోసం ఈ నూనెను కనుబొమ్మలను పెట్టి కొద్దిసేపు మసాజ్ చేయాలి. రోజూ ఇలా చేస్తే కనుబొమ్మల జుట్టు మూలాలు బలంగా అవుతాయి. అలాగే కొత్త వెంట్రుకలు వస్తాయి. దీంతో కనుబొమ్మలు మందంగా అవుతాయి.

44
పెట్రోలియం జెల్లీ

పెట్రోలియం జెల్లీతో కూడా మీరు కనుబొమ్మలు మందంగా పెరిగేలా చేయొచ్చు. ఈ పెట్రోలియం జెల్లి కనుబొమ్మలకు మంచి పోషణను అందిస్తుంది. అలాగే కనుబొమ్మల చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇందుకోసం మీరు వేళ్లతో పెట్రోలియం జెల్లీని కనుబొమ్మలకు పెట్టాలి. 

కొద్దిసేపు మసాజ్ చేయాలి. దీన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కడిగేయాలి. కొన్నిరోజులు ఇలాగే చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. అయితే ఆయిలీ స్కిన్ ఉన్నవారు మాత్రం దీన్ని ఉపయోగించకపోవడమే మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories