Hair Growth: మహిళలు అందరూ పొడవైన జుట్టు కావాలనే కోరుకుంటారు. కానీ.. ఈ రోజుల్లో సరైన ఆహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడి వంటి కారణాల వల్ల జుట్టు పూర్తిగా ఊడిపోతోంది. అందుకే.. ఆ సమస్కలన్నింటినీ కేవలం తమలపాకుతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తమలపాకు గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమలపాకు తింటే... తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమౌతుంది. ఈ తమలపాకు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా మందికి తెలుసు. కానీ... ఇదే తమలపాకు జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. మరి.. ఆ తమలపాకును ఎలా వాడాలో తెలుసా? ఈ తమలపాకు వాడటం వల్ల జుట్టు కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటి? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...
24
జుట్టు పెరుగుదలకు తమలపాకు...
మహిళలు అందరూ పొడవైన జుట్టు కావాలనే కోరుకుంటారు. కానీ.. ఈ రోజుల్లో సరైన ఆహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడి వంటి కారణాల వల్ల జుట్టు పూర్తిగా ఊడిపోతోంది. అందుకే.. ఆ సమస్కలన్నింటినీ కేవలం తమలపాకుతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. తమలపాకులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, కాల్షియం వంటి వివిధ పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
34
చుండ్రు కి చెక్...
తమలపాకులలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రు , తలపై ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. దీనిలోని అన్ని ముఖ్యమైన పోషకాలు తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. జుట్టు మూలాలను పోషిస్తాయి. ముఖ్యంగా, తమలపాకులలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి జుట్టును బలహీనపరిచే, వాటి పెరుగుదలను నిరోధించే ఫ్రీ రాడికల్ నష్టాన్ని తగ్గిస్తాయి. దీని వల్ల జుట్టు అందంగా మారుతుంది.
తలపాకులను బాగా రుబ్బి, దాని పేస్ట్ లేదా తమలపాకులతో తయారు చేసిన నూనెతో మసాజ్ చేసినప్పుడు, అది జుట్టు మూలాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. తలపాకులను బాగా మెత్తగా నూరి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. దీన్ని మీ జుట్టు మూలాల నుండి చివరల వరకు అప్లై చేయండి. తర్వాత 30 నిమిషాల తర్వాత మీ జుట్టును కడగాలి. దీనిలోని పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.