Skin Care: వీటిని తింటే మచ్చలు, మొటిమలు తగ్గి.. మీ ముఖం అందంగా మెరిసిపోతుంది

Published : Sep 27, 2025, 01:09 PM IST

Skin Care:ముఖం ఆరోగ్యంగా ఉంటేనే అందంగా కనిపిస్తుంది. అయితే చాలా మందికి ముఖం నిండా మొటిమలు, మచ్చలు ఉంటాయి. వీటిని పోగొట్టడానికి ఎన్నో ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. కానీ మీరు కొన్ని ఆహారాలను తిన్నా ఈ సమస్య తగ్గి మీ ముఖం అందంగా మెరిసిపోతుంది తెలుసా?

PREV
15
మొటిమలు తగ్గాలంటే ఏం చేయాలి?

ఆడవారు ముఖం అందంగా కనిపించాలని ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. అలాగే ఎన్నో ఇంటి చిట్కాలను కూడా ఫాలో అవుతుంటారు. అయితే మొటిమలను, మచ్చలను మాత్రం పోగొట్టలేకపోతుంటారు. అన్ని ప్రయత్నాలు చేసి ఇక ఇవి పోవని ఫిక్స్ అయిపోతుంటారు. కానీ కొన్ని ఆహారాలను రోజూ తింటే మాత్రం మొటిమలు సులువుగా పోయి మీ ముఖం అందంగా మెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే మొటిమలు తగ్గడానికి, ముఖం అందంగా కనిపించడానికి ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
చర్మాన్ని కాంతివంతంగా, అందంగా మార్చడానికి ఎలాంటి ఆహారాలను తినాలి?

పొడి చర్మాన్ని తేమగా మార్చడానికి అవిసె గింజలు

అవిసె గింజల్లో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని ఎండ, కాలుష్యం, ధూమపానం మొదలైన హానికరమైన ప్రభావాల నుంచి రక్షిస్తాయి. అంతేకాదు వీటిని తింటే ముడతలు కూడా తగ్గుతాయి. అలాగే డ్రై స్కిన్, మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. వీటిని తినడమే కాకుండా.. అవిసె గింజల నూనెను కూడా మీరు ముఖానికి వాడొచ్చు. అయితే మీరు ఒమేగా-3 కొవ్వులు ఉండే గుమ్మడి గింజలు, చియా విత్తనాలు వంటి ఆహారాలను కూడా తినొచ్చు. ఇవి కూడా చర్మాన్ని హెల్తీగా, క్లియర్ గా ఉంచుతాయి.

పెరుగు

పెరుగు ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగులో ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. అలాగే ఇది ప్రోబయోటిక్స్ తో నిండిపోయి ఉంటుంది. ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే ఇది సోరియాసిస్, మొటిమలు వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ అనే మంచి బ్యాక్టీరియా చర్మ ఆర్దీకరణు పెంచుతుంది. దీంతో చర్మం హెల్తీగా ఉంటుంది. మొటిమలు తగ్గుతాయి. అలాగే మీ చర్మం కాంతివంతంగా అవుతుంది.

35
గ్రీన్ టీ

గ్రీన్ టీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇది మన చర్మాన్ని మృదువుగా కూడా చేస్తుందది. రోజూ కప్పు గ్రీన్ టీ తాగితే మీరు బరువు తగ్గడమే కాకుండా.. చర్మ సమస్యలు తగ్గిపోతాయి. స్కిన్ మంచి గ్లో వస్తుంది. గ్రీన్ టీ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ అయిన పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంలో సెబమ్ ఉత్పత్తిని తగ్గించేందుకు సహాయపడతాయి. గ్రీన్ టీ తాగడం వల్ల మొటమలు, మచ్చలు కూడా తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు.

నీళ్లు పుష్కలంగా తాగాలి

చర్మం సహజంగా కాంతివంతంగా కనిపించాలంటే మాత్రం మీరు నీళ్లను పుష్కలంగా తాగాలి. ముఖ్యంగా డ్రై స్కిన్ సమస్య ఉన్నవారు. మీరు రోజుకు 8 కప్పుల నీళ్లను తాగితే మీ శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మీ చర్మం తేమగా, కాంతివంతంగా ఉంటుంది. నీళ్లనే కాకుండా.. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పుచ్చకాయ, కీరదోసకాయ, గ్రేప్స్ వంటి పండ్లను కూడా తినండి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడతాయి.

45
చిలగడదుంపలు

చిలగడదుంపల్లో మన శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా దీనిలో ఉండే విటమిన్ ఎ చర్మాన్ని హెల్తీగా ఉంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. చిలగడదుంపలను తింటే మొటిమలు తగ్గుతాయి. మచ్చలూ పోతాయి. ఈ విటమిన్ ఎ చర్మ రంగును మెరుగుపర్చడానికి, ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే వాపును తగ్గించడానికి, చర్మ రంధ్రాలు మూసుకుపోవడానికి సహాయపడుతుంది. వీటిని ఉడకబెట్టుకుని తింటే మంచిది.

క్యారెట్లు తినాలి

చర్మానికి క్యారెట్లు కూడా మేలు చేస్తాయి. వీటిలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన చర్మాన్ని హానికరమైన సూర్యకిరణాల నుంచి కాపాడుతుంది. అలాగే ఇది మన స్కిన్ టోన్ ను మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది. ఈ బీటా కెరోటిన్ ఖర్జూరాలు, బొప్పాయి, గుమ్మడి గింజలు, ఆప్రికాట్లు, మామిడి వంటి పండ్లు, కూరగాయల్లో కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ బీటా కెరోటిన్ మన శరీరంలోకి వెళ్లి విటమిన్ ఎ గా మారుతుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగానూ ఉంచుతుంది. ఇది మొటిమలను, మచ్చలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

55
మొటిమలు ఉన్నవారు ఏం తినకూడదు?

పాలు తాగొద్దు

పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ మీకు మొటిమలు ఉంటే మాత్రం ఎక్కువగా తాగకూడదు. ఎందుకంటే ఇవి మొటిమలు అయ్యే లా చేస్తాయి. కాబట్టి మొటిమల సమస్య ఎక్కువగా ఉన్నవారు పాలను తాగకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.

చక్కెర, కార్బోహైడ్రేట్లు తీసుకోవద్దు

వైట్ రైస్, బ్రెడ్, సోడా, కేక్ వంటి కార్బోహైడ్రేట్లు, చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారాలు కూడా మొటిమలకు కారణమవుతాయి. వీటిని ఎక్కువగా తింటే మీకు ఖచ్చితంగా మొటిమలు వస్తాయి. ఈ ఫుడ్స్ లోని కార్బోహైడ్రేట్లు, షుగర్ రక్తంలోకి తొందరగా చేరిపోతాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి బ్లడ్ షుగర్ ను పెంచుతాయి. అయితే బ్లడ్ షుగర్ ను తగ్గించడానికి ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అయినప్పుడు మీ చర్మంలో ఆయిల్ ఉత్పత్తిని పెంచే హార్మోన్లు ప్రభావితం అవుతాయి. ఇలా మీకు మొటిమలు వస్తాయి.

మొటిమలు తగ్గడానికి ఏం తినాలి?

మొటిమలను తగ్గించడానికి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఫైబర్ కంటెంట్ బ్లడ్ షుగర్ ను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది మొటిమలు కాకుండా చేస్తుంది. ఇందుకోసం క్యారెట్లు, బీన్స్, ఓట్ మీల్ వంటి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories