
పీరియడ్స్ ఒక సహజ ప్రక్రియ. ఇది రెగ్యులర్ గా నెలా నెలా సమయానికి అయినప్పుడు ఆడవారు హెల్తీగా ఉన్నట్టు. టైంకి పీరియడ్స్ వచ్చే వారు గర్భందాల్చడంలో ఎలాంటి ఇబ్బంది పడరని ఆరోగ్య నిపుణులు అంటారు. అయితే ఈ రోజుల్లో చాలా మంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడుతున్నారు. కొంతమంది నెలా తప్పించి నెలా లేదా రెండు మూడు నెలలకోసారి పీరియడ్స్ వస్తుంటాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంటే అనారోగ్యకరమైన ఆహారాలను తినడం, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత వంటి వివిధ కారణాల వల్ల పీరియడ్స్ లేట్ అవుతుంటాయి. అయితే ఈ సమస్యను మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో కూడా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
దాల్చిన చెక్క
మసాలా దినుసుల్లో ఒక్కటైన దాల్చిన చెక్క కూడా పీరియడ్స్ రెగ్యలర్ గా రావడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే ఎన్నో ఔషదగుణాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఆడవారు దాల్చిన చెక్క వాటర్ ను తాగితే హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి . ఈ హార్మోన్ల అసమతుల్యత వల్లే పీరియడ్స్ లేట్ గా వస్తాయి. అందుకే మీరు గనుక దాల్చిన చెక్క వాటర్ ను రాత్రి పడుకునే ముందు తాగండి. ఈ వాటర్ శరీరాన్ని వెడెక్కించి హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. దీంతో మీకు పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి.
అల్లం
అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గించడంతో పాటుగా వాపు, పీరియడ్స్ తిమ్మిరిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు అల్లం ఆడవారి శరీరంలో హార్మోన్లను సమతుల్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవారికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. రోజూ వేడి వేడి అల్లం టీ తాగితే పీరియడ్స్ రెగ్యలర్ గా వస్తాయి. అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది.
పసుపు
వంటకు వాడే పసుపు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఉండే కర్కుమిన్ లో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి పీరియడ్స్ నొప్పిని, వాపును, పీరియడ్స్ తిమ్మిరిని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం మీరు పసుపు టీ తాగొచ్చు లేదా మీ భోజనంలో పసుపును చేర్చుకోవచ్చు.
ఆకుకూరలు
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా ఇవి ఆడవారికి పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి సహాయపడతాయి. కాలె, పాలకూర, కాలే, ఆవాల ఆకు వంటి ఆకు కూరలను తింటే మంచిది. వీటిలో మెగ్నీషియం, ఇనుము, ఫోలెట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి పీరియడ్స్ ను రెగ్యులర్ గా రావడానికి సహాయపడతాయి. అలాగే వీటిలో ఉండే మెగ్నీషియం పీరియడ్స్ తిమ్మిరిని తగ్గించడానికి సహాయపడుతుంది.
గింజలు, విత్తనాలు
బాదం, వాట్ నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ వంటి గింజలు, విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ లెవెల్స్ ను కంట్రోల్ చస్తాయి. అలాగే పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చేందుకు సహాయపడతాయి. అవిసెగింజలు హార్మోన్లను సమతుల్యంగా ఉంచి హెల్తీ పీరియడ్స్ కు సహాయపడతాయి.
కొన్ని రకాల పండ్లను తిన్నా పీరియడ్స్ రెగ్యలర్ గా వస్తాయి. ముఖ్యంగా పైనాపిల్, బొప్పాయి పండ్లు. బొప్పాయిలో పపైన్ అనే ఎంజ్ ఉంటుంది. ఇది గర్భాశయ సంకోచాలకు మద్దతునివ్వడంతో పాటుగా పీరియడ్స్ రెగ్యలర్ గా రావడానికి సహాయపడతాయి. ఇకపోతే పైనాపిల్ పండులో ఉండే బ్రోమలైన్ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పీరియడ్స్ రెగ్యలర్ గా రావడానికి, పీరియడ్స్ నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.
బరువు కంట్రోల్ లో ఉండాలి
శరీర బరువు కూడా పీరియడ్స్ పై ప్రభావం చూపుతుంది. అంటే బరువు ఎక్కువగా ఉండేవారికి పీరియడ్స్ రెగ్యలర్ గా రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీరికి ఊబకాయంతో పాటుగా దీనికి సంబంధించిన సమస్యలు వస్తాయి. దీంతో పీరియడ్స్ లేట్ గా వస్తాయి. అలాగే మరీ బక్కగా ఉన్నవారికి కూడా పీరియడ్స్ రెగ్యులర్ గా రావు. ఎందుకంటే వీరి శరీరంలో సరిపడా రక్తం ఉండదు. అందుకే బరువు ఆరోగ్యకరంగా ఉండేట్టు చూసుకోవాలి.
జంక్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదు
మనం తినే ఆహారం కూడా మన పీరియడ్స్ పై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీరు ఎక్కువగా ప్రాసెస్ చేసిన, జంక్ ఫుడ్ ను తింటే పీరియడ్స్ లేట్ గా వస్తాయి. ఎందుకంటే వీటిలో విషపూరిత కెమికల్స్ ఉంటాయి. అలాగే మన శరీరానికి అవసరమైన పోషకాలు కూడా ఉండదు. పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలంటే మాత్రం మీరు ప్రాసెస్ చేసి పాప్ కార్న్, మీట్, చేపలు, లేదా వెజిటేబుల్స్ ను తినకూడదు. అలాగే బర్గర్, పిజ్జా, ఫ్రైడ్ చికెన్ వంటి జంక్ ఫుడ్స్ ను తినకూడదు.
ఒత్తిడిని తగ్గించుకోవాలి
ఒత్తిడి వల్ల కూడా ఆడవారికి పీరియడ్స్ లేట్ అవుతుంటాయి. ఈ ఒత్తిడి వల్ల హార్మోన్లు అసమతుల్యంగా అవుతాయి. దీనితో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వస్తాయి. అందుకే పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలంటే మీరు ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందుకోసం యోగా, ధ్యానం వంటివి చేయండి. అలాగే తగినంత విశ్రాంతి తీసుకోండి.