Kurta Designs: ప్లెయిన్ కుర్తా వేసుకోవాలంటే బోర్ గా ఉందా? తక్కువ ఖర్చుతో.. మీ ప్లెయిన్ కుర్తాకు గ్రాండ్ లుక్ ఇవ్వచ్చని మీకు తెలుసా? దాని కోసం చిన్న చిట్కా ఫాలో అయితే చాలు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రతి ఒక్కరూ తాము వేసుకునే కుర్తాలు అందరికంటే స్పెషల్ గా కనిపించాలి అని అనుకుంటారు. అలా అని ప్రతిసారీ ఖరీదైన, కొత్త డ్రెస్ కొనడం అంటే కష్టం కదా.. అలాంటివారు పాత డ్రెస్ నే మళ్లీ కొత్తగా మార్చుకోవచ్చు. దాని కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు.. కేవలం మీ దగ్గర రూ.200 ఉంటే చాలు. మీ డ్రెస్ కి సూటయ్యే లేస్ కొని.. దానిని టాప్ బోర్డర్ కీ, చున్నీకి వేస్తే చాలు. ఇలా చేయడం వల్ల డ్రెస్ కి గ్రాండ్ లుక్ వస్తుంది. డిజైనర్ వేర్ లా కనిపిస్తుంది.
25
గోటా పట్టీ లేస్...
మీ దగ్గర ఏదైనా ప్లెయిన్ కుర్తా సెట్ ఉంటే.. దానికి గోల్డెన్ లేదా సిల్వర్ గోటా పట్టీ లేస్ ఎటాచ్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి కుర్తా సెట్స్ ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అవుతున్నాయి. మీరు మాత్రం ఈ లేస్ ని మీటర్ రూ.20 నుంచి రూ.50 లోపే కొనుగోలు చేయవచ్చు. ఇది చిన్న లేస్ అయినా.. డ్రెస్ కి మాత్రం గ్రాండ్ లుక్ ఇస్తుంది. డిజైైనర్ వేర్ డ్రెస్ వేసుకున్న ఫీల్ ఇస్తుంది.
35
గోల్డెన్ లేస్...
ఈ ఫోటోలో చూపించినట్లు మీ దగ్గర గ్రీన్ కలర్ ప్లెయిన్ డ్రెస్ ఉంటే.. దానికి గోల్డ్ కలర్ లేస్ వేసి సింపుల్ గా కుట్టేస్తే సరిపోతుంది. సింపుల్ లేస్ అయినా.. మీ డ్రెస్ కి మాత్రం గ్రాండ్ లుక్ ఇస్తుంది. పండగలు లేదా.. ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ కి, పెళ్లిళ్లకు ఇలాంటి డ్రెస్ వేసుకుంటే మీ లుక్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది.
కాంట్రాస్ట్ లుక్ కోసం, మీ ప్లెయిన్ సూట్‌పై ఫ్లోరల్ కట్ లేస్‌ను వాడొచ్చు. ఈ రకమైన లేస్ కొంచెం ఖరీదైనది. కానీ సూట్, దుపట్టాకు జతచేశాక, మొత్తం లుక్ మారిపోతుంది. మీ మామూలు ప్లెయిన్ సూట్ కూడా ప్రత్యేక సందర్భాల్లో వేసుకునే డిజైనర్ డ్రెస్‌గా మారిపోతుంది.
55
జాలి వర్క్ వైట్ లేస్
మీ దగ్గర ఫ్లోరల్ కుర్తీ ఉంటే, దానికి జాలి వర్క్ ఉన్న లేస్‌ను జోడించి అందమైన లుక్ ఇవ్వొచ్చు. సూట్ స్లీవ్స్ చివర, అలాగే కుర్తీ అంచున దీన్ని వేయండి. దీనికి అదనంగా, ప్యాంట్ బాటమ్‌కు బబుల్ లేస్ వేసి మరింత అందంగా కనిపించేలా చేయవచ్చు.