Blouse Designs: ఎలాంటి చీర కట్టినా ట్రెండీగా కనిపించాలా? ఈ బ్లౌజులు ట్రై చేయండి

Published : Jun 11, 2026, 03:42 PM IST

Blouse Designs: పార్టీలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఏవైనా సరే స్పెషల్ గా కనిపించాలని అనుకుంటున్నారా? అయితే.. ఖరీదైన చీరను ఎంచుకోవడం కాదు.. దానికి తగినట్లు బ్లౌజులు ధరించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ట్రెండ్ కి తగినట్లు బ్లౌజులు ఎంచుకోవాలి..

PREV
15
రష్మిక మందన్న ఫ్యాషన్ సెన్స్
రష్మిక బ్లౌజు డిజైన్లు...

దక్షిణాది అందమైన హీరోయిన్లలో రష్మిక మందన్నా కూడా ఒకరు. ఆమెకు ఫ్యాషన్ సెన్స్ చాలా ఎక్కువ. ఎప్పటికప్పుడు ట్రెండీగా కనిపిస్తూ ఉంటుంది. కేవలం వెస్ట్రన్ దుస్తుల్లోనే కాదు.. చీర కట్టినా కూడా తన ఫ్యాషన్ సెన్స్ ని పక్కన పెట్టదు. మీరు కూడా రష్మికలాగా చీరలో అందంగా మెరిసిపోవాలంటే.. ఆమె ధరించిన కొన్ని ట్రెండీ బ్లౌజు డిజైన్లు ఇప్పుడు చూద్దాం…

25
హై నెక్ బ్లౌజ్..

రష్మిక ధరించిన ఈ చీర సింపుల్ గా ఉన్నా.. ఆ బ్లౌజుతోనే ట్రెండీ లుక్ వచ్చింది. మీరు నెట్టెడ్ సారీలు సెలక్ట్ చేసుకున్నప్పుడు  ఇలాంటి బ్లౌజు డిజైన్లు ట్రై చేయచ్చు. చీర ఏ కలర్ ఉంటే.. ఆ కలర్ శాటిన్ ఫ్యాబ్రిక్ సెలక్ట్ చేసుకుంటే.. ఇలా హై నెక్ లో ప్లీట్స్ పెట్టి డిజైన్ చేసుకోవచ్చు. కాలేజీలో ఫంక్షన్లుకు, పార్టీలకు ఇలాంటి బ్లౌజులు చాలా బాగుంటాయి.

35
ఫుల్ స్లీవ్స్...

మీరు ఏదైనా ప్లెయిన్ శారీ తో మెరిసిపోవాలి అనుకుంటే.. బ్లౌజ్ హైలెట్ అయ్యేలా చూసుకోవాలి. మీరు సెలక్ట్ చేసుకున్న చీర రంగులోనే… డిజైనర్ బ్లౌజు క్లాత్ కొనుక్కుంటే…సరిపోతుంది. బ్లౌజు క్లాత్ హెవీగా ఉంటే… ఎలాంటి డిజైన్స్ ఏమీ లేకుండా నార్మల్ గా కుట్టించినా కూడా మీరు హైలెట్ అవుతారు. చాలా స్పెషల్ గా కనపడతారు.

45
కాంట్రాస్ట్ బ్లౌజులు..

చీరకు కాంట్రాస్ట్ బ్లౌజులు ధరించినా కూడా మీరు హైలెట్ గా కనిపిస్తారు. ముఖ్యంగా రష్మిక లాగా రెడ్ కలర్ శారీకి.. కాంట్రాస్ట్ గా సిల్వర్ బ్లౌజు సెలక్ట్ చేసుకుంటే.. హైలెట్ గా కనిపిస్తారు. స్లీవ్ లెస్ కంఫర్ట్ గా లేకపోతే..షార్ట్ స్లీవ్స్ ట్రై చేయవచ్చు. చాలా అందంగా కనిపిస్తారు.

55
జరీ చీర...

చాలా మంది పార్టీ వేర్ చీరలకు మాత్రమే బ్లౌజులు స్టైలిష్ గా వేసుకోగలం అనుకుంటారు. కానీ, హెవీ జరీ ఉన్న పట్టు చీరలకు కూడా ట్రెండీ బ్లౌజులు ట్రై చేయవచ్చు.  బ్రాడ్ నెక్ లైన్ తో ఉన్న ఈ బ్లౌజు.. చీర జరీ అంచుకి పర్ఫెక్ట్ గా సరిపోయింది. చాలా అందంగా కనిపిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories