MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Vozinha: ఇదెక్కడి మాస్ మామ.. ఒక్క రోజులో 10 మిలియన్ల ఫాలోవర్స్, ఒక్క మ్యాచ్ తో హీరోగా మారాడు ఎవరు ఈ జోసిమర్ డియాస్..?

Vozinha: ఇదెక్కడి మాస్ మామ.. ఒక్క రోజులో 10 మిలియన్ల ఫాలోవర్స్, ఒక్క మ్యాచ్ తో హీరోగా మారాడు ఎవరు ఈ జోసిమర్ డియాస్..?

Vozinha: ఒకే ఒక్క మ్యాచ్ అతన్ని హీరోగా మార్చేసింది. అతని ఆట తీరుకు ప్రపంచం ఫిదా అయిపోయింది. ఎంతలా అంటే.. నిన్నటి వరకు 50వేల కంటే తక్కువగా ఉన్న ఫాలోవర్స్ ఒక్కరోజులో 10 మిలియన్లు దాటారు. ఈ ఓవర్ నైట్ హీరో వివరాలు ఇప్పుడు చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 17 2026, 10:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఓవర్ నైట్ స్టార్...
Image Credit : Getty

ఓవర్ నైట్ స్టార్...

సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు క్రేజ్ ఉండటం చాలా కామన్. క్రికెటర్లు, సినీ తారల అప్ డేట్స్ తెలుసుకోవడానికి వాళ్లను రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారు. చాలా మంది సెలబ్రెటీలకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉండి ఉండొచ్చు. ఆ ఫాలోవర్స్ గ్రాడ్యువల్ గా పెరుగుతారు. కానీ, ఒక వ్యక్తికి మాత్రం ఓవర్ నైట్ లో ఫాలోవర్స్ పెరిగారు. అతను కూడా సెలబ్రెటీనే.. కానీ.. ఎవరూ ఏరోజూ పట్టించుకోలేదు. కానీ.. ఒక్క ఆట అతని జీవితాన్ని మార్చేసింది. ప్రపంచం మొత్తం తనని గుర్తించేలా చేసింది. ఎవరు ఆ ప్లేయర్..? ఏ మ్యాచ్ తో అంత క్రేజ్ సంపాదించుకున్నాడు..? ఒక్క రాత్రిలో అంత మంది ఫాలోవర్స్ అతని సొంతం ఎలా అయ్యారు అనే వివరాలు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గోల్ కీపర్ టూ వరల్డ్ ఫేమస్ స్టార్..
Image Credit : Getty

గోల్ కీపర్ టూ వరల్డ్ ఫేమస్ స్టార్..

రెండు రోజుల క్రితం ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్స్ జరిగాయి. ఫైనల్స్ లో కేప్ వెర్డే, స్పెయిన్ ఈ రెండు దేశాలు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. కేప్ వెర్డే దేశం గెలవకపోయినా.. ఆ టీమ్ గోల్ కీపర్ జోసిమర్ డియాస్ మాత్రం.. ప్రజల హృదయాన్ని గెలిచాడు.జోసిమర్ డియాస్ ని ముద్దుగా వొజిన్హా (Vozinha) అని పిలుచుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి కరెంట్ ఫేవరేట్ గా మారిపోయాడు. అంతేకాదు.. తన దేశానికి ఒక గుర్తింపు కూడా తీసుకొచ్చాడు.

ఈ ఫిఫా వరల్డ్ కప్ లో తొలిసారి అత్యంత తక్కువ జనాభా ఉన్న రెండు దేశాలు పోటీల్లో పాల్గొన్నాయి. అందులో కేప్ వెర్డే కూడా ఒకటి. ఈ దేశ జనాభా 5,25,000. కేవలం 5లక్షల జనాభా ఉన్న ఈ టీమ్.. పెద్ద పెద్ద జట్లమీద ఏం గెలుస్తుంది..? ఘోర పరాజయం పాలౌతుందని అందరూ అనుకున్నారు. ఈ టీమ్ ని చాలా తక్కువ అంచానా వేశారు. కానీ.. ఈ టీమ్ ఫినాలేకి చేరింది. చివరకు మ్యాచ్ డ్రా అయ్యేలా చేసింది. ముఖ్యంగా ఈ టీమ్ గోల్ కీపర్ జోసిమర్ డియాస్ ఆడిన ఆటకు.. స్పెయిన్ టీమ్ ని కప్ అందుకోకుండా చేసిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు.

34
ఓవర్ నైట్ ఫాలోవర్స్...
Image Credit : Getty

ఓవర్ నైట్ ఫాలోవర్స్...

ఈ మ్యాచ్ కి ముందు జోసిమర్ డియాస్ కి ఇన్ స్టాగ్రామ్ లో కేవలం 42వేల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. అలాంటిది ఫినాలే మ్యాచ్ లో అతను ఆడిన ఆటకు ఒక్క రాత్రిలో అతని తలరాతే మారిపోయింది. మరుసటి రోజుకి 7మిలియన్ల ఫాలోవర్స్ వచ్చారు. రెండు రోజుల్లో 11 మిలియన్ల ఫాలోవర్స్ కి చేరుకున్నాడు. అంటే.. అతను తన దేశ జనాభాతో పోలిస్తే..2000 శాతం ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు. వాళ్ల దేశంలోని అందరూ అతనిని ఫాలో అయినా.. ఇతర దేశాల నుంచి 20 రెట్ల ఎక్కువ ఫాలోవర్స్ వచ్చారు. దీని అర్థం.. అతని ఆటకు కేవలం వారి దేశస్థులు మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షితులయ్యారు.

44
అతని ఆట విషయానికి వస్తే...
Image Credit : Getty

అతని ఆట విషయానికి వస్తే...

జోసిమర్ డియాస్ కేప్ వెర్డే లోని సావో విసెంటే ద్వీపానికి చెందినవాడు. 2007లో తన స్వదేశంలోని ఒక జట్టుకు గోల్ కీపర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టాడు. ఆఫ్రికా, యూరప్ లలో కూడా అరడజనుకు పైగా ప్రొఫెషనల్ జట్టతో ఆడాడు. ఇప్పటి వరకు కెఫ్ వెర్డే జుట్టు తరపున 90 మ్యాచ్ లు ఆడాడు. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తో తనేంటో.. ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక.. అతని గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. ఓవర్ నైట్ హీరో అవ్వడం అంటే ఇదీ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Related Stories
Recommended image1
Crows: పాములు కాదు.. కాకులు మనుషులపై పగపడతాయా? ఎన్ని ఏళ్లు గుర్తుంచుకుంటాయో తెలుసా?
Recommended image2
Radhika Merchant: ఎవరి మీదా ఆధారపడి బతకకూడదు, అంబానీ కొడుకుతో పెళ్లిపై తొలిసారి స్పందించిన కోడలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved